26/11 ముంబయి సూత్రధారి హఫీజ్ సయీద్‌, లాహోర్ లో అరెస్ట్

26/11 Mumbai attack Hafiz Saeed arrested, 26/11 Mumbai Attacks Mastermind Hafiz Saeed Arrested In Lahore, Hafiz Saeed arrested By Pakistan Police, Hafiz Saeed JuD chief Hafiz Saeed arrested in Lahore, Mango News, Mumbai Attack Hafiz Saeed Arrested in Pakistan, Pakistan Arrests 26/11 Mumbai Terror Attack Mastermind Hafiz Saeed, Pakistan says it has arrested 26/11 Mumbai attack mastermind Hafiz

26/11 ముంబయి ఉగ్రవాద దాడి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి, మరియు జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ ముఖ్య నాయకుడు హఫీజ్ సయీద్‌ ను 2019 జూలై 17 న పాకిస్థాన్‌లోని లాహోర్‌లో అరెస్టు చేశారు. లాహోర్‌కు చెందిన కౌంటర్-టెర్రరిజం విభాగం (సిటిడి) హఫీజ్ సయీద్‌ను అరెస్టు చేసింది. ప్రపంచవ్యాప్తంగా నిషేధం చేయబడిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ అరెస్ట్ గురించి పాకిస్తాన్ మీడియా ధృవీకరించింది. అరెస్ట్ చేసిన వెంటనే జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్టు పాకిస్తాన్ మీడియా వర్గాల సమాచారం, ఒక కేసులో విచారణ నిమిత్తం లాహోర్ నుంచి గుజ్రాన్‌వాలా వెళ్తుండగా హఫీజ్ సయీద్ ను అరెస్టు చేశారు.

హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ (ఎల్ఇటి) సహ వ్యవస్థాపకుడు మరియు జమాత్ ఉద్ దవా, ఇతర ఉగ్రవాద సంస్థలు కొన్ని హఫీజ్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారని, అంతర్జాతీయ దేశాల నుండి ఒత్తిడి రావడంతోనే పాకిస్తాన్ హఫీజ్ మరియు అతని అనుచరులపై కేసులు నమోదు చేసిందని చెబుతున్నారు. 2008 నవంబర్ 26 న ముంబయి లో జరిగిన ఉగ్రవాద దాడిలో 166 ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రధాన సూత్రధారి అయిన హాఫిజ్ ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. హఫీజ్ పై పలు దేశాలు రివార్డులు ప్రకటించారు, చివరికి ఎఫ్‌ఎటిఎఫ్ పాకిస్తాన్ ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి కారణంగానే ఈ అరెస్టు జరిగిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

 

[subscribe]
[youtube_video videoid=MGI8soMy6RI]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 1 =