ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం గోవాలోని పనాజీలో జల్ జీవన్ మిషన్ కింద జరిగిన హర్ ఘర్ జల్ ఉత్సవ్ లో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ముందుగా శ్రీ కృష్ణ భక్తులకు జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, నేడు దేశంలోని 10 కోట్ల గ్రామీణ కుటుంబాలకు పైపుల ద్వారా శుభ్రమైన నీటి సౌకర్యం కల్పించబడింది. ఇంటింటికీ నీరు అందించాలన్న ప్రభుత్వ ప్రచారానికి ఇది పెద్ద విజయం. ఇది సబ్కా ప్రయాస్ కి గొప్ప ఉదాహరణ అని అన్నారు. అలాగే హర్ ఘర్ జల్ సర్టిఫికేట్ పొందిన మొదటి రాష్ట్రంగా గోవా అవతరించినందుకు, ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీటిని అనుసంధానించినందుకు ప్రధాని అభినందనలు తెలిపారు. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ ఈ ఘనత సాధించిన మొదటి కేంద్రపాలిత ప్రాంతమని తెలిపారు. ప్రజలు, ప్రభుత్వాల, స్థానిక స్వయ ప్రభుత్వ సంస్థల కృషిని ప్రధాని ప్రశంసించారు. అతి త్వరలో అనేక రాష్ట్రాలు ఈ జాబితాలో చేరబోతున్నాయని చెప్పారు.
మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లక్ష గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్‌గా మారడం మరో విజయంగా ప్రధాని పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా (ఓడీఎఫ్) ప్రకటించిన తర్వాత, గ్రామాలకు ఓడీఎఫ్ ప్లస్ హోదాను సాధించడం తదుపరి తీర్మానం పెట్టుకున్నామని, అంటే గ్రామాల్లో కమ్యూనిటీ టాయిలెట్లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, గ్రే వాటర్ నిర్వహణ మరియు గోబర్ధన్ ప్రాజెక్టులు ఉండాలన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న నీటి భద్రత సవాలును ప్రధాని ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశం – వికషిత్ భారత్ యొక్క తీర్మానాన్ని సాధించడంలో నీటి కొరత ఒక పెద్ద అడ్డంకిగా మారుతుందని అన్నారు. నీటి భద్రత ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందని అన్నారు. నీటి భద్రత కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న బహుముఖ విధానం గురించి ప్రధాని మాట్లాడుతూ, క్యాచ్ ద రెయిన్, అటల్ భుజల్ పథకం, ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లు, నదుల అనుసంధానం మరియు జల్ జీవన్ మిషన్ వంటి కార్యక్రమాలను పేర్కొన్నారు. భారతదేశంలో రామ్‌సర్ వెట్‌ల్యాండ్ సైట్‌ల సంఖ్య 75కి పెరిగిందని, వీటిలో గత 8 ఏళ్లలో 50 జోడించామని చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చిన 7 దశాబ్దాలలో కేవలం 3 కోట్ల కుటుంబాలకు మాత్రమే నీటి సౌకర్యం కలిగి ఉండగా, కేవలం 3 సంవత్సరాలలోనే 7 కోట్ల గ్రామీణ కుటుంబాలకు పైపుల ద్వారా నీటిని అనుసంధానించిన ఘనతను ప్రధాని కొనియాడారు. దేశంలో దాదాపు 16 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఉన్నాయని, నీటి కోసం బయటి వనరులపై ఆధారపడాల్సి వచ్చిందని అన్నారు. ఈ ప్రాథమిక అవసరం కోసం పోరాడుతున్న గ్రామాల్లోని ఇంత పెద్ద జనాభాను మేము వదిలిపెట్టలేమన్నారు. అందుకే 3 ఏళ్ల క్రితం ఎర్రకోట నుంచి ఇంటింటికీ పైపుల ద్వారా నీరు అందిస్తామని ప్రకటించానని, ఈ కార్యక్రమం కోసం 3 లక్షల 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY