8 ఏళ్లలో తెలంగాణలో అద్భుతమైన ప్రగతి, డిప్లమాటిక్ ఔట్‌రిచ్‌ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

Minister KTR Addressed Diplomatic Outreach Programme held at T Hub Hyderabad Today, Telangana Minister KTR Addressed Diplomatic Outreach Programme held at T Hub Hyderabad Today, Diplomatic Outreach Programme held at T Hub Hyderabad, T Hub Hyderabad, Diplomatic Outreach Programme, Telangana Minister KTR, Diplomatic Outreach Programme News, Diplomatic Outreach Programme Latest News And Updates, Diplomatic Outreach Programme Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని టీ హబ్ లో జరిగిన “డిప్లమాటిక్ ఔట్‌రిచ్‌” కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో దాదాపు 50 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సుల్ జనరల్స్, గౌరవ కాన్సుల్ జనరల్స్, హై కమిషనర్లు, ట్రేడ్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో ఆర్థిక, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రం అందించే ప్రయోజనాలను హైలైట్ చేస్తూ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మరియు ప్రోగ్రెసివ్ ఇండస్ట్రియల్ పాలసీల కారణంగా గత 8 సంవత్సరాలుగా తెలంగాణ విజయ గాథలు వివరించారు.

గత 8 ఏళ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని, రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు అయిందన్నారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండగా, 2022 నాటికి రూ.11.55 లక్షల కోట్లకు చేరిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వ్యవసాయ, ఐటీ, ఫార్మస్యూటికల్‌, బయోసైన్స్‌, ఏరోస్పేస్‌, పారిశ్రామిక రంగాలు సహా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ తెలంగాణ ముందంజలో ఉందన్నారు. 15 వందలకుపైగా మల్టీనేషన్‌ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్_రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఎక్స్‌టర్నల్ ఎంగేజ్‌మెంట్ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి, టీ హబ్ సీఈవో శ్రీనీ రావు, వీహబ్ హైదరాబాద్ సీఈవో దీప్తి రావుల, సీఆర్ఓ అమర్ నాథ్ రెడ్డి, సెక్టార్ డైరెక్టర్లు శక్తి నాగప్పన్ (లైఫ్ సైన్సెస్), సుజయ్ కరంపూరి (ఎలక్ట్రానిక్స్), అఖిల్ గవర్ (ఫుడ్ ప్రాసెసింగ్), ప్రవీణ్ పీఏ (ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్), జి.రాజేందర్ రెడ్డి (లాజిస్టిక్స్) మరియు ఇన్వెస్ట్ తెలంగాణ బృందం పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + twenty =