ఎల్బీస్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్

CS Somesh Kumar Inspected Arrangements for Swatantra Bharata Vajrotsavalu Closinig Ceremony to be held at LB Stadium, Swatantra Bharata Vajrotsavalu Closinig Ceremony to be held at LB Stadium, CS Somesh Kumar Inspected Arrangements for Swatantra Bharata Vajrotsavalu Closinig Ceremony, Swatantra Bharata Vajrotsavalu Closinig Ceremony, LB Stadium, Closinig Ceremony, Swatantra Bharata Vajrotsavalu, Telangana CS Somesh Kumar, Telangana Chief Secretary Somesh Kumar, Swatantra Bharata Vajrotsavalu News, Swatantra Bharata Vajrotsavalu Latest News And Updates, Swatantra Bharata Vajrotsavalu Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8 నుండి జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల యొక్క ముగింపు వేడుకలు ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఆగస్టు 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలనుండి ప్రారంభమయ్యే ఈ ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు పాల్గొనేందుకు ప్రత్యేక వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదికలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో శంకర్ మహదేవన్, శివమణి లాంటి ప్రముఖుల సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 25 వేలమందికి పైగా పాల్గొంటారని వెల్లడించారు.

ఈ సమావేశంలో అడిషనల్ డీజీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అడిషనల్ పోలీస్ కమీషనర్ చౌహాన్, ట్రాఫిక్ డీసీపీ రంగనాధ్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ ఛీప్ గణపతి రెడ్డి, టీఎస్ఐసీసీ ఎండీ నరసింహారెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ బి.రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

శిశువిహార్ లో పండ్లు, స్వీట్లు పంపిణి చేసిన సీఎస్ సోమేశ్ కుమార్:

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం అమీర్ పేట్ సమీపంలోని శిశు విహార్ లోని పిల్లలకు పండ్లు, స్వీట్లను సీఎస్ సోమేశ్ కుమార్ పంపిణీ చేశారు. ఈనెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున పండ్లు, స్వీట్లు పంపిణి చేపడుతున్నామని సీఎస్ వెల్లడించారు. అనాధ శరణాలయాలు, ఆసుపత్రులలో ఉండే వారికి పండ్లు, స్వీట్లు పంచడం ద్వారా వారిలో ఒక మానసిక స్ధైర్యాన్ని కలుగచేయడంతోపాటు వారిలో స్వేచ్ఛ స్ఫూర్తిని పెంపొందించడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్బంగా శిశు విహార్ లో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్లి వారికి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. శిశువిహార్ లో ఉంటున్న అవిభక్త కవలలు వీణా, వాణి లను కలసి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా దివ్యాంగులు, బాల బాలికలు పాడిన పాటలను, ప్రదర్శించిన ఫాన్సీ డ్రెస్ పోటీలను తిలకించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 14 =