ఇక నుంచి అంధులు ఏ వస్తువునైనా చూడొచ్చట..

AI Technology Smart Vision Lens Helping Visually Impaired Able to See Nearest Things,AI Technology Smart Vision Lens,Visually Impaired Able to See Nearest Things,Smart Vision Lens Helping Visually Impaired,Mango News,Mango News Telugu,the blind can see any object, AI,Smart Vision, Ai Application,AI Technology,Vision Aid,Smart Vision Lens,AI Technology Smart Vision News Today,Smart Vision Lens Latest News,Smart Vision Lens Latest Updates,Smart Vision Lens Live News,Smart Vision Lens Live Updates

నథింగ్ ఈజ్ ఇంపాజబుల్ అన్న మాట ఎప్పటి నుంచో వింటున్నా.. ఇప్పుడు దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ఈజీ చేసేసింది. వివిధ రంగాల్లో కృత్రిమ మేధ (AI) చేస్తున్న అద్భుతాలు.. అన్నీ ఇన్నీ కావన్న విషయాన్ని చూస్తే అది ఈజీగా అర్ధం అయిపోతుంది. రీసెంట్‌గా అంధుల కోసం ఓ గుడ్ న్యూస్ వినిపించింది ఏఐ.

అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం తయారు చేసిన ఏఐ ఆధారిత పరికరాలు వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ఏఐ సాంకేతికతతో పనిచేసే ‘స్మార్ట్‌ విజన్‌’ అనే పరికరాన్ని అమర్చిన కంటి అద్దాల్ని ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి దవాఖానలో 50 మందికి పంపిణీ చేశారు.

వీటి సాయంతో అంధులు ఏ వస్తువునైనా చూడొచ్చు. సందేశాల్ని చదవొచ్చు. నడుస్తుండగా అడ్డొచ్చేవాటిని, ఎదుటి వ్యక్తుల్ని గుర్తించవచ్చు. మల్టీ టాస్కింగ్‌ను ఏకకాలంలో చేపట్టేందుకు ‘స్మార్ట్‌ విజన్‌’లో పలు సెన్సార్లను అమర్చారు. రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీతో ఇది త్రీడీ ఇమేజ్‌లను సృష్టిస్తుంది.

‘స్మార్ట్‌ విజన్‌’లో బ్లూటూత్‌, మైక్రోఫోన్‌, స్పీకర్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని ఏఐ అప్లికేషన్‌కు అనుసంధానం చేస్తారు. దాంతో కృత్రిమ మేధ సేవలు అంధులకు అందుబాటులోకి వస్తాయి. బ్రెయిలీ లిపిలో ఉన్న బటన్స్‌ను నొక్కటం ద్వారా లేదా వాయిస్‌ కమాండ్స్‌ ఇవ్వటం ద్వారా స్మార్ట్‌ విజన్‌ సేవల్ని పొందుతారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

‘విజన్‌ ఏయిడ్‌’ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో 2021లో పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టారు. ఫేస్‌ రికగ్నైజేషన్‌, మనుషుల భావాలు, చుట్టుపక్కల ఉండే వాహనాలు, వస్తువులు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, జీబ్రా క్రాసింగ్‌ లైన్స్‌.. మొదలైనవి పసిగట్టే మెషిన్‌ లెర్నింగ్‌తో ఏఐని రూపొందించారు. ఈ పరికరం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అంధులతో మాట్లాడుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + twenty =