ఇండియా vs వెస్టిండీస్ T20 సిరీస్: నేడు రెండో మ్యాచ్, సిరీస్‌పై భారత్ గురి

Ind vs WI T20 Team India To Play 2nd Match Today, Eye on The Series Win

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నేడు (శుక్రవారం) భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించిన టీమిండియా అదే ఊపులో రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లో ఉండటం శుభపరిణామం. అలాగే, యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్, రాణిస్తుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్ లోవిషయానికొస్తే వన్డే సిరీస్ నుంచి నిన్నటి మాచ్ వరకు ఆకట్టుకుంటున్నారు. కానీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళన కల్కిగిస్తోంది.

వెస్టిండీస్ మాత్రం ఆశ్చర్యంగా వరుస ఓటములతో డీలాపడి ఉంది. ఆ జట్టులో నైపుణ్యానికి కొదవే లేదు. మంచి మంచి హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల ఆటగాళ్లు ఉన్నారు. ఐనాసరే ఎందుకనో ఒక్కరు కూడా తుదికంటా నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చలేక పోతున్నారు. ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్‌ను సమం చేయటానికి చూస్తోంది. అదే సమయంలో.. టీమిండియా కూడా ఈ మ్యాచ్ తోనే సిరీస్ పట్టేయాలని చూస్తోంది. కాబట్టి, ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

జట్లు (అంచనా)
భారత్‌

రోహిత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌, విరాట్‌, పంత్‌, సూర్యకుమార్‌, శార్దూల్‌, సిరాజ్‌, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, చాహల్‌

వెస్టిండీస్

పొలార్డ్‌ (కెప్టెన్‌), బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, పూరన్‌, పావెల్‌, హోల్డర్‌, ఆలెన్‌, షెఫర్డ్‌, ఒడీన్‌ స్మిత్‌, అకీల్‌ హోసేన్‌, కాట్రెల్‌

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ