నేడు మేడారం మహా జాతరకు వెళ్లనున్న సీఎం కేసీఆర్

2022 Medaram Jatara, CM KCR, CM KCR to visit Medaram jatara, CM KCR to Visit Medaram Maha Jathara, KCR to Visit Medaram, KCR to Visit Medaram Sammakka-Saralamma Maha Jathara, Mango News, Medaram Jatara 2022, Medaram Jatara Latest Updates, medaram sammakka sarakka jatara, Sammakka Sarakka Jatara 2022, Sammakka-Saralamma Maha Jathara, Telangana CM KCR to Visit Medaram Sammakka-Saralamma Maha Jathara, Telangana CM KCR to Visit Medaram Sammakka-Saralamma Maha Jathara Today

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు (ఫిబ్రవరి 18, శుక్రవారం) మేడారంలో పర్యటించనున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర ఫిబ్రవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మహాజాతర నేటితో మూడురోజుకి చేరుకోగా, రేపటి (ఫిబ్రవరి 19, శనివారం) వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో ఈ రోజు ఉదయం 11 గంటలకు మేడారంకు బయలుదేరనున్నారు.

అనంతరం జాతర ప్రాంగణానికి చేరుకొని, గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోనున్నారు. మేడారం పర్యటన అనంతరం మధ్యాహ్నం నుంచి సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ మేడారం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైనా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో వారికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 12 =