భారత్ vs దక్షిణాఫ్రికా తొలి వన్డే: భారత్ విజయ లక్ష్యం 297 పరుగులు

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో భాగంగా మొదలైన తొలి వన్డే బొలాండ్‌ పార్క్‌ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదటగా బ్యాటింగ్‌ తీసుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్‌ డికాక్, జానెమన్ మలన్‌లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ బవుమా, వాన్‌ డస్సెన్‌ వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ నిర్మిస్తూ భారీ స్కోరు దిశగా కదిలారు. చివరకు ఏకంగా ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. నాలుగో వికెట్‌కి రికార్డ్‌ పార్ట్‌నర్ షిప్ 204 పరుగులను సాధించారు. వీరిద్దరి బ్యాటింగ్ వలన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది.

ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్‌ బవుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు చేసి ఆదుకున్నాడు. మరోవైపు వాన్‌ డస్సెన్ కూడా 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు చెలరేగి ఆడటంతో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లు వీరి జంటని విడదీయడంలో విఫలమయ్యారు. మ్యాచ్ ఆసాంతం ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. జస్ప్రీత్‌ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్‌ అశ్విన్ ఒక వికెట్‌ సాధించారు. 297 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది. ఓపెనర్లుగా లోకేష్ రాహుల్ మరియు శిఖర్ ధవన్ రానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF