విశ్వం నుంచి భూమికి వచ్చిన 555 క్యారెట్ల అద్భుత వజ్రం – లండన్‌లో వేలం

555-Carat Black Diamond ‘The Enigma’ Unveiled in Dubai, Black Diamond ‘The Enigma’ Unveiled in Dubai, Enigma, it’s Thought to be From Universe, Large 555-Carat black diamond, Largest known 555-carat cut black diamond unveiled in Dubai, Mango News, Massive 555-Carat Black Diamond, Massive 555-Carat Black Diamond Unveiled, Massive 555-Carat Black Diamond Unveiled in Dubai, Massive 555-Carat Black Diamond Worth Crores Unveiled in Dubai, Newly unveiled 555-carat black diamond, The Enigma

అనంత విశ్వంలో చిత్ర విచిత్రాలకు కొదవే లేదు. మనిషి ఊహాశక్తికి మించి ఉండే అనేక పాలపుంతలు, లెక్కకు అందని నక్షత్రాలు, కోట్ల కొలది గ్రహాలు, మరెన్నో గ్రహ శకలాలు, తోకచుక్కలు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో ఈ సువిశాల విశ్వంలో భాగమై ఉన్నాయి. అందులో గుర్తు తెలియని ఒక గ్రహానికి చెందినదిగా భావిస్తున్న ఓ అరుదైన వజ్రం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ వజ్రం కొనుగోలు చేయాలంటే రూపాయలు, డాలర్లలోనే కాదు క్రిప్టో కరెన్సీలో కూడా చెల్లింపులు చేయవచ్చు. భూమికి చెందని ఈ అరుదైన వజ్రాన్ని ‘ది ఎనిగ్మా’ అని పిలుస్తున్నారు.

ఖగోళంలోని మరో గ్రహానికి చెందినదిగా చెప్పబడుతున్న అరుదైన వజ్రాన్ని సోత్‌బే సంస్థ వేలానికి పెడుతోంది. 2022 ఫిబ్రవరిలో ఈ వజ్రాన్ని లండన్‌లో వేలం వేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వజ్రం విశేషాలను దుబాయ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోత్‌బే సం‍స్థ ప్రదర్శించింది. ఈ అపురూపమైన వజ్రం భూమ్మిద లభించే మెటీరియల్‌తో రూపొందలేదని, గ్రహ శకలాలు భూమిని తాకినప్పుడు ఇక్కడి వాతవారణ పరిస్థితుల కారణంగా ఘనీభవించి, వేడేక్కి, ఆవిరై ఇలా పలు రకాలైన రసాయన మార్పులకు లోనై ఈ నల్లని వజ్రం ఏర్పడిందని సోత్‌బే పేర్కొంది.

అయితే ఈ వజ్రం భూమ్మిది ఏ ప్రాంతంలో లభించిందనే వివరాలు ఆ సంస్థ వెల్లడించలేదు. ఈ వజ్రం 555.55 క్యారెట్ల స్వచ్ఛతను కలిగి ఉంది. అంతేకాదు ఈ వజ్రానికి 55 ముఖాలు ఉన్నాయి. న్యూమరాలజీ పరంగా ఇలా అనేక 5 అంకె కలిసి రావడం చాలా అరుదని డైమండ్ ఎక్సపర్ట్స్ అంటున్నారు. కార్బనాడోగా పేర్కొనే నల్లని వజ్రాలు చాలా అరుదుగా లభిస్తుంటాయని వారు చెప్పారు. ఇప్పటి వరకు భూమ్మిద నల్లని వజ్రాలు కేవలం బ్రెజిల్‌, సెంట్రల్‌ ఆఫ్రికాలోనే దొరికాయని సోత్‌బే తెలిపింది. ది ఎనిగ్మా డైమండ్‌ వజ్రం వేలంలో ప్రారంభ ధర 5 మిలియన్‌ పౌండ్లు (మన కరెన్సీలో రూ.50 కోట్లు)గా నిర్ణయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 9 =