భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన నిర్ణయం

Indian Star Tennis Player Sania Mirza to Retire from Tennis at the End of 2022 Season,Indian Star Tennis Player Sania Mirza to Retire from Tennis ,Indian Star Tennis Player Sania Mirza,Indian Star Tennis Player, Sania Mirza to Retire from Tennis at the End of 2022 Season, Sania Mirza to Retire from Tennis, Sania Mirza,Sania Mirza, India tennis star to retire after 2022 season,Sania Mirza to retire from tennis at the end of 2022 season ,Sania Mirza to retire after 2022 season ,Sania Mirza to retire,mango news

ఇండియ‌న్ టెన్నిస్‌లో సంచ‌ల‌నం సానియా మీర్జా. దేశంలో మ‌హిళ‌ల టెన్నిస్‌ లో ఎంతోమందికి సానియా ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఫ్యాన్స్ కు షాకిచ్చింది. త్వరలోనే టెన్నిస్ నుంచి రిటైర్ కానున్నట్లు తెలిపింది. 2022 సీజనే తనకు చివరిదని ప్రకటించింది సానియా. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ లో ఓటమి తర్వాత ఈ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సానియా, ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచ్నోక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ‘ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్నాను. కానీ, నేను మొత్తం సీజన్‌ ఆడగలనో లేదో తెలియదు. కానీ నేను సీజన్ చివరివరకు ఉండాలని కోరుకుంటున్నాను’ అని సానియా మీర్జా వెల్లడించింది.

2013 నుంచి సానియా సింగిల్స్ ఆడటం మానేసింది. అప్పటి నుంచి ఆమె డబుల్స్‌లో మాత్రమే ఆడుతోంది. సింగిల్స్‌లో ఆడుతున్నప్పుడు కూడా సానియా చాలా విజయాలు సాధించింది. అయితే, సుదీర్ఘమైన తన కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్ల‌ను దాటింది సానియా. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులను ఓడించి ప్రపంచ 27వ ర్యాంక్‌కు చేరుకుంది. డబుల్స్ లో ప్రపంచ నెం.1 ర్యాంకు సాధించింది. దాదాపు 90 వారాల పాటు డబుల్స్‌లో సానియా మీర్జా నంబర్‌వన్‌గా కొనసాగింది. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ కు చేరిన ఒపెన్ ఎరాకు చెందిన మూడవ మహిళ సానియా. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో 6 బంగారు పతకాలతో సహా 14 పతకాలను సాధించింది సానియా మీర్జా.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF