ఐపీఎల్ ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్, వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ నియామకం

IPL 2023 Delhi Capitals Appointed David Warner as Skipper and Axar Patel to be Vice-Captain,IPL 2023 Delhi Capitals,Delhi Capitals Appointed David Warner,David Warner as Skipper in IPL,Delhi Capitals Axar Patel to be Vice-Captain,Mango News,Mango News Telugu,IPL 2023,David Warner To Lead Delhi Capitals,David Warner Appointed Captain,IPL 2023 Latest News,IPL 2023 Latest Updates,David Warner Named Delhi Capitals Captain,IPL 2023 Delhi Capitals News Updates

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కారు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో.. ఈ సీజన్‌కు అతడు అందుబాటులో ఉండకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది. అలాగే భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా ఈనెల 31న ఐపీఎల్ ప్రారంభమవుతుంది. ఇక టీమ్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యవహరించబోతున్నాడు. ఇంకా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఢిల్లీ ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్‌గా ప్రకటించింది. గతంలో 2019 సీజన్‌లో మెంటార్ పాత్రలో గంగూలీకి ఢిల్లీ క్యాపిటల్స్‌తో పనిచేసిన అనుభవం ఉంది. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ అద్భుతమైన నాయకుడిగా ఉన్నాడు. అయితే ఈ సీజన్‌కు దురదృష్టవశాత్తూ అతడి సేవలను కోల్పోతున్నాం. ఇక యాజమాన్యం నాపై చూపుతున్న విశ్వాసానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని తెలిపాడు. కాగా వార్నర్ వివిధ జట్ల తరపున 2009 నుండి ఆడిన 13 సీజన్లలో 162 మ్యాచ్‌ల్లో 5881 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలు మరియు 55 అర్ధసెంచరీలు చేశాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here