ఎంపీ సంతోష్ ను కలిసిన వనజీవి రామయ్య, హరితనిధికి 20 టన్నుల ఎర్రచందనం చెట్లు అందిస్తానని ప్రకటన

Growing greenery, Hyderabad, Increase green cover, Mango News, Padmasri Vanajeevi Ramayya, Padmasri Vanajeevi Ramayya Meets MP Santosh Kumar, Padmasri Vanajeevi Ramayya Meets MP Santosh Kumar at Pragathi Bhavan, Pragathi Bhavan, Ramayya Meets MP Santosh Kumar at Pragathi Bhavan, Vanajeevi meets MP Santhosh Kumar, Vanajeevi Ramaiah pledges to donate red sanders trees, Vanajeevi Ramayya Meets MP Santosh Kumar, Vanajeevi Ramayya Meets MP Santosh Kumar at Pragathi Bhavan, Vanjeevi Ramaiah is responsible for his own health

అనేక దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ, వనాలు పెంచుతూ వనజీవిగా పద్మశ్రీ అందుకున్న రామయ్య బుధవారం నాడు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ నేత, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమాలపై చర్చించారు. దేశమంతా పచ్చబడాలని హరిత సంకల్పంతో మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అత్యంత విజయవంతం కావాలని, ప్రకృతి దీవెనలు ఉండాలని ఈ సందర్భంగా రామయ్య దంపతులు ఆకాంక్షించారు. వారికి పాదాభివందంనం చేసి ఎంపీ సంతోష్ కుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు.

హరితనిధికి 20 టన్నుల విలువైన ఎర్రచందనం చెట్లు అందిస్తా:

ప్రస్తుతం మన ముందు ఉన్న సవాల్ పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే అని, అందుకు పరిష్కారం ఉన్న అడవులు కాపాడుతూ, కొత్తగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచటమే అని రామయ్య అన్నారు. హరితనిధికి తన వంతుగా స్వయంగా నాటి పెద్ద చేసిన 20 టన్నుల విలువైన ఎర్రచందనం చెట్లను ప్రభుత్వానికి అందిస్తానని వెల్లడించారు. ఏడు పదుల వయస్సులోనూ నిత్య ఉత్సాహంతో పర్యావరణ కృషి చేస్తున్న రామయ్య దంపతులను కలవటం ఆనందంగా ఉందని సంతోష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రామయ్య ఆరోగ్య పరిస్థితిపై సంతోష్ కుమార్ ఆరా తీశారు. ఎలాంటి వైద్యం కావాలన్నా తనను సంప్రదించాలని, తానే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. రామయ్య నాటేందుకు, పంపిణీకి అవసరమైన మొక్కలను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున అందించేందుకు ఎంపీ సంతోష్ సంసిద్దత తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =