ప్రజాస్వామ్య పాలనలేని చైనాతో భారత్‌ను పోల్చడం సరికాదు: మోడీ

It Is Not Fair To Compare India With Undemocratic China Says Modi, It Is Not Fair To Compare India With China, Not Fair To Compare India With Undemocratic China, PM Modi, China, Bharat, Modi Comments On China, Latest Modi Comments On China, Modi Comments On Undemocratic China, India, PN Modi, Latest India News, India News Update, Mango News, Mango News Telugu
PM Modi, China, Bharat, Modi Comments on china

ఆర్థిక వృద్ధిలో భారత్‌ను కొందరు చైనాతో పోల్చడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తప్పు పట్టారు. తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్థిక వృద్ధిలో భారత్‌ను చైనాతో పోల్చడం సరికాదని మోడీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను చైనాలాంటి దేశంతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదని.. అక్కడ నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడేటప్పుడు భారత్‌‌ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే సముచితంగా ఉంటుందని మోడీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పాలన లేని చైనాతో పోలిస్తే సరికాదని అన్నారు.

భారత్ అగ్రరాజ్యాలతో పోటీ పడి అభివృద్ధిలో దూసుకెళ్తోందన్న మోడీ.. దేశంలో ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉందని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా భారత్ గుర్తింపు సాధించిందని వివరించారు. భారత్‌‌ను అవినీతి, నిరుద్యోగ సమస్యలు వెంటాడుతున్నాయన్న విమర్శలను ఖండించిన మోడీ.. ఆ సమస్యలే ఉంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఎలా గుర్తింపు సాధించిందని నిలదీశారు.

ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలకు భారత సంతతి వ్యక్తులు సీఈవో‌లుగా కొనసాగుతున్నారని మోడీ వెల్లడించారు. భారత్‌లో నైపుణ్యాల అంతరం లేదని చెప్పేందుకు ఇదే సరైన ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తోందన్న మోడీ.. అందుకే దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలు భారత్‌లో పెట్టుబడుతు పెట్టేందుకు ముందుకొచ్చాయని వివరించారు.

అలాగే భారత్‌లో మైనార్టీలను అణచివేస్తున్నారన్న విమర్శలను మోడీ ఖండించారు. భారతీయ సమాజం ఏ మతం, మైనార్టీ వర్గంపై వివక్ష చూపటం లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అన్ని మతాల వారిని.. అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తూ.. సమాన హక్కులు కల్పిస్తోందని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE