షెడ్యూల్‌ కంటే ముందే అభ్యర్థులను బరిలోకి దించే యోచనలో జగన్

Jagan Plans To Field Candidates Ahead Of Schedule, Jagan Plans To Field Candidates, Candidates Ahead Of Schedule, YCP, Cm jagan, AP Politics, AP Assembly elections, Latest Jagan Plans To MLA Candidates, Latest MLA Candidates News, MLA Candidates News, Latest AP Political News, Political News, AP News, CM Jagan, AP CM, Political News, Mango News, Mango News Telugu
YCP, Cm jagan, AP Politics, AP Assembly elections

తెలంగాణలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ గద్దె దిగిపోయింది. అయితే ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. రెండోసారి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న జగన్.. ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పటి నుంచే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయానికి అభ్యర్థులను గ్రౌండ్‌లోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు.

అటు మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈక్రమంలో జగన్ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. ఇప్పటికే 50 మందికి పైగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొందరు సిట్టింగ్‌లకు మరోచోట టికెట్ ఇవ్వనున్నారట. కొందరు సీనియర్లకు ఎమ్యెల్యే టికెట్ ఇవ్వకుండా.. ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. ఈక్రమంలో వారివారి స్థానంలో కొత్తవారిని వెతికే పనిలో పడ్డారు సీఎం జగన్. అనేక సర్వేలు పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్ ఎంపిక చేస్తున్నారట.

అదే విధంగా వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసి జనాల్లోకి పంపించాలని సీఎం జగన్ భావిస్తున్నారట. అలా చేయడం వల్ల ఎన్నికల సమయానికి అభ్యర్థులంతా ఫోర్ ఫ్రంట్‌లోకి వస్తారని జగన్ అనుకుంటున్నారట. అందుకే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారట. జనవరిలోపు 175 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి.. సంక్రాంతి పండుగ తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఇలా ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించడం ద్వారా.. అసంతృప్తులను, ఇంకేమైనా సమస్యలు వచ్చినా సర్దుబాటు చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారట.

అయితే ఇప్పటికే ఈసారి టికెట్ దక్కదని భావించిన కొందరు వైసీపీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. మరికొందరు కూడా ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో వారు పార్టీ మారకుండా కాపాడుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. అలకబూనిన వారికి ప్రభుత్వం వచ్చాక అవకాశాలు కల్పిస్తామని జగన్ హామీలు ఇస్తున్నారట. అయినప్పటికీ వినకపోతే.. వారి ఇష్టానికి వదిలిపెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 19 =