మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో బీజేపీ జోరు

Election Results Live Updates, Haryana Assembly Elections Vote Counting, Haryana Election Results Live Updates, latest political breaking news, Maharashtra Assembly Elections Vote Counting, Maharashtra Election Results Live Updates, Maharashtra Haryana Election Results Live Updates, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచలనాను నిజం చేస్తూ భారతీయ జనతా పార్టీ తన జోరును కొనసాగిస్తుంది. రెండు రాష్ట్రాలలోను బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 150 పైగా స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి ఆధిక్యంలో ఉండగా, 95 పైగా స్థానాల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, ఇతరులు 40 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అదేవిధంగా హర్యానాలో బీజేపీ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 32, జేజేపీ 11, ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను అక్టోబర్ 21 న నిర్వహించారు. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ రోజు సాయంత్రం కల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. నాగ్ పూర్ సౌత్ నుంచి సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, వర్లి నియోజక వర్గం నుంచి నుంచి ఆదిత్య థాకరే, కర్నాల్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహార్‌ లాల్‌ ఖట్టర్‌ ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల పలితాలతో పాటు ఇతర 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి.

[subscribe]