హుజూర్‌నగర్‌ లో కారు జోరు, ఆధిక్యతలో సైదిరెడ్డి

Huzurnagar Assembly Constituency, Huzurnagar Assembly constituency bypoll, Huzurnagar By Poll Results, Huzurnagar By Poll Results Latest Update, Huzurnagar Constituency By Poll Results Update, Mango News Telugu, Political Updates 2019, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TRS Candidate Sanampudi Saidi Reddy Leading In Huzurnagar, TRS Candidate Sanampudi Saidi Reddy Leading In Huzurnagar By-Election, TRS Candidate Sanampudi Saidi Reddy Leading In Huzurnagar Bypoll

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో 8వ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 17,400 ఓట్లతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్ కు ఆధిక్యం పెరుగుతుండడంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి వెనకంజలో ఉన్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా ఇప్పటికి 8 రౌండ్స్ పూర్తయ్యాయి. లెక్కింపు పూర్తయిన తరువాత డ్రా తీసిన 5 వీవీఫ్యాట్లలో ఉన్న స్లిప్పులను లెక్కించి అక్కడి ఈవీఎం ఓట్లతో సమానంగా ఉన్నాయో లేవో పరిశీలిస్తారు.

సూర్యాపేటలో గల వ్యవసాయ మార్కెట్‌లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితం వెలువడనుంది. ఈ ఎన్నికల బరిలో ముగ్గురు మహిళలతో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో తుది ఫలితాల కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 3 =