కరోనా భయంతో మిస్ వరల్డ్ 2021 ఫైనల్ పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. భారత్ తరపున పోటీలో పాల్గొంటున్న మిస్ ఇండియా 2020 మానస వారణాసికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. మానస వారణాసితో పాటు పలువురు పోటీదారులు కోవిడ్ -19 బారిన పడటంతో మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా పడ్డాయి. డిసెంబర్ 16వ తేదీన గ్రాండ్ ఫినాలే ప్యూర్టోరికోలో జరగాల్సి ఉంది. అయితే, మరికొద్దిరోజుల్లో ప్యూర్టోరికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు రీషెడ్యూల్ చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
మిస్ వరల్డ్ 2021 పోటీదారులతో సహా కొంతమంది సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడ్డారు. కరోనా వచ్చిన వారిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మానస వారణాసి కూడా ఉన్నారు. 23 యేళ్ల మానస వారణాసి 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించనుంది. పోటీదారులు, ప్రొడక్షన్ టీం సభ్యులు కరోనా బారిన పడటం వలన వారి భద్రతే కాకుండా, పోటీలను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకుల భద్రత కోసం మిస్ వరల్డ్ పోటీల వాయిదా నిర్ణయం తీసుకున్నామని ఈవెంట్ ఆర్గనైజర్లు వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ