ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ప్రధానం

Bhutan confers highest civilian award on Modi, Bhutan confers highest civilian award upon PM Modi, Bhutan Confers Its Highest Civilian Award On PM, Bhutan confers its highest civilian award on PM Modi, Bhutan Confers Its Highest Civilian Award On PM Narendra Modi, Bhutan’s Highest Civilian Award, Mango News, PM Modi, PM Modi Honoured With Bhutan’s Highest Civilian Award, pm narendra modi, PM Narendra Modi conferred with Bhutan’s highest civilian Award

భూటాన్ ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం Ngadag Pel gi Khorlo అందించనున్నట్లు భూటాన్ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని గురించి భూటాన్ ప్రధాని ట్వీట్‌ చేసారు. “అత్యున్నత పౌర పురస్కారం అయిన నగ్ దాగ్ పెల్ గి ఖోర్లోకు మీ ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీజీ పేరును హిజ్ మెజెస్టి అని పిలవడం వినడానికి చాలా ఆనందంగా ఉంది” అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

భారతదేశం కోవిడ్-19 విపత్తు సమయంలో భూటాన్ కు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీని నగ్ దాగ్ పెల్ గి ఖోర్లోతో సత్కరించాలని ఆ దేశం నిర్ణయించింది. “ఎన్నో ఏళ్లుగా భారత్ భూటాన్ కు సహాయ హస్తం అందిస్తూనే ఉంది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత ప్రధాని మోదీజీ అందించిన సహాయాన్ని, మద్దతును మరువలేం. ఈ సందర్భంగా ఆయనకు భూటాన్ ప్రజల నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోదీ ఈ అవార్డుకు అర్హులు. ఈ గౌరవాన్ని ఆయనకు అందించే రోజు కోసం ఎదురు చూస్తున్నాం.” అని ఈ విషయాన్ని భూటాన్ పీఎంఓ నిర్ధారించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eleven =