పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సెప్టెంబర్ 28, మంగళవారం పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పంపించారు. “ఒక వ్యక్తి పాత్ర పతనం రాజీ మూలం నుండి వచ్చింది. పంజాబ్ భవిష్యత్తు మరియు పంజాబ్ సంక్షేమం కోసం ఎజెండాపై నేను ఎన్నడూ రాజీపడలేను. ఈ క్రమంలోనే పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. కాంగ్రెస్ కు సేవ చేస్తూనే ఉంటాను” అని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
కాగా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రెండు నెలలకే సిద్ధూ రాజీనామా చేయడం విశేషం. మరోవైపు పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్ర కేబినెట్ లో మంత్రులు ఎంపిక, మాజీ కెప్టెన్ అమరిందర్ సింగ్ బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నట్టు వార్తల రావడం, తదనంతర పరిణామాలు నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసినట్టు తెలుస్తుంది.
— Navjot Singh Sidhu (@sherryontopp) September 28, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ