అమూల్ పాల ధర మరోసారి లీటరుకు రూ.2 పెంపు, గుజరాత్‌ మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు

Amul Increased Milk Prices by Rs 2 per Litre Except in Gujarat, Amul has increased prices of full cream milk and buffalo milk by Rs 2 per litre, full cream milk, buffalo milk, Amul has increased prices by Rs 2 per litre, Rs 2 per litre, Amul hikes milk prices, Amul raises milk prices by Rs 2, Gujarat, Amul milk prices News, Amul milk prices Latest News And Updates, Amul milk prices Live Updates, Mango News, Mango News Telugu

దేశంలో అమూల్ బ్రాండ్ పాల ధరలు మరోసారి పెరిగాయి. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ బ్రాండ్ పేరుతో పాలు మరియు పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో అమూల్ ఫుల్ క్రీమ్ మిల్క్ మరియు గేదె పాల ధరలను లీటరుకు రూ.2 పెంచుతున్నట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటరుకు రూ.61 నుంచి రూ.63కి పెరిగింది. అయితే పెరిగిన ధర ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో తెలియాల్సి ఉంది.

కాగా ఈ ఏడాదిలో అమూల్ బ్రాండ్ పాల ధరలు పెరగడం ఇది మూడోసారి. ముందుగా మార్చిలో పాల ధరలు లీటరుకు రూ.2 పెంచగా, ఆగస్టులో కూడా నిర్వహణ వ్యయం పెరుగుదల మరియు పాల ఉత్పత్తి ఖర్చులు పెరగడం కారణంగా లీటరుకు మరో రూ.2 చొప్పున ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + fifteen =