దేశంలో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఎట్టకేలకు వినియోగదారులకు కొంత ఊరట లభించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నామని శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా లీటరు పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 చొప్పున ధరలు తగ్గనున్నాయని తెలిపారు. గతేడాది నవంబర్‌లో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10ల ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే.
అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్స్ పొందిన 9 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ సంవత్సరం ఒక్కో గ్యాస్ సిలిండర్ కు రూ.200 సబ్సిడీని ఇస్తామని తెలిపారు. అయితే ఈ సబ్సిడీ 12 సిలిండర్ల వరకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. మరోవైపు సిమెంట్ ధర తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF