మంకీపాక్స్ వైరస్ కలవరం, ఇప్పటికే 11 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెఛ్ఓ ప్రకటన

WHO Says Monkeypox Outbreaks in 11 Countries 80 Confirmed Cases so far, WHO Says 80 Confirmed Monkeypox Cases so far, WHO Says Monkeypox Outbreaks in 11 Countries, Monkeypox Outbreaks in 11 Countries, 11 Countries, Monkeypox, 80 Confirmed Cases, World Health Organization confirm 80 cases of Monkeypox in 11 countires, World Health Organisation confirms 80 monkeypox cases so far in 11 countries, 80 Monkeypox Cases In 11 Countries, Monkeypox Cases News, Monkeypox Cases Latest News, Monkeypox Cases Latest Updates, Monkeypox Cases Live Updates, Mango News, Mango News Telugu,

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇంకా కరోనా మహమ్మారితో సతమతమవుతుంటే తాజాగా మంకీపాక్స్ వైరస్ కూడా కలవరం రేపుతుంది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెఛ్ఓ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 11 దేశాలలో మంకీపాక్స్ కేసులు నివేదించబడ్డాయని డబ్ల్యూహెఛ్ఓ తెలిపింది. అలాగే ఇప్పటికి 80 మంకీపాక్స్ కేసులు ధృవీకరించబడ్డాయని, 50 కేసులు పరీక్ష దశలో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. నిఘా విస్తరిస్తున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

ఇటీవలి మంకీపాక్స్ వ్యాప్తి విలక్షణమైనది, ఎందుకంటే అవి నాన్-ఎండెమిక్ దేశాలలో సంభవిస్తున్నాయని తెలిపారు. డబ్ల్యూహెఛ్ఓ మరియు దాని భాగస్వాములు మంకీపాక్స్ వ్యాప్తి యొక్క పరిధి మరియు కారణాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వైరస్ ఇప్పటికే అనేక దేశాలలో కొన్ని జంతులలో ఎండెమిక్ గా ఉందని, అయితే ఇది స్థానిక ప్రజలు మరియు ప్రయాణికుల మధ్య అప్పుడప్పుడు వ్యాప్తికి దారితీస్తుందని చెప్పారు. ప్రభావితమైన దేశాలతో మరియు ఇతరులతో కలిసి మంకీపాక్స్ వ్యాధి నిఘాను విస్తరించి, ప్రభావితమయ్యే వ్యక్తులను కనుగొని వారికి మద్దతునివ్వడంతో పాటుగా వ్యాధిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై డబ్ల్యూహెఛ్ఓ మార్గదర్శకత్వం అందిస్తుందని తెలిపారు. కోవిడ్-19కి భిన్నంగా మంకీపాక్స్ వ్యాపిస్తుందని చెప్పారు.

మంకీపాక్స్ సన్నిహిత పరిచయం ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి, ప్రభావితమైన వ్యక్తులు మరియు వారి సన్నిహిత పరిచయాలపై దృష్టి పెట్టాలని డబ్ల్యూహెఛ్ఓ సూచించింది. ఈ అంటువ్యాధి ఉన్న వారితో సన్నిహితంగా ఉండే వ్యక్తులకే ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుందని, ఇందులో హెల్త్ కేర్ వర్కర్స్, కుటుంబ సభ్యులు మరియు లైంగిక భాగస్వాములు ఉంటారని పేర్కొన్నారు. మరోవైపు మంకీపాక్స్ పై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మంకీపాక్స్ నమోదవుతున్న దేశాలలో పరిస్థితిని గమనించాలని, ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరైనా అనారోగ్యంగా లేదా లక్షణాలు కలిగిఉంటే వారి నమూనాలను పూణే ఎన్ఐవీకి పంపించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =