కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాలివే…

coronavirus india state wise list today, coronavirus india update live state wise list today, coronavirus state wise list, coronavirus state wise list in india, coronavirus state wise list india, india coronavirus cases, List of Five States which have Highest Number of Positive Cases

దేశంలో కరోనావైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆగస్టు 26, బుధవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల 32,34,474 కు, మరణాల సంఖ్య 59,449 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే దేశంలో రోజువారి పరీక్ష సామర్ధ్యం కూడా 10 లక్షలకు చేరుకుంది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికి మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలు:

  • మహారాష్ట్ర – 7,18,711
  • తమిళనాడు – 3,97,261
  • ఆంధ్రప్రదేశ్ – 3,82,469
  • కర్ణాటక – 3,00,406
  • ఉత్తరప్రదేశ్ – 2,03,028

దేశంలో కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలు:

  • మహారాష్ట్ర – 23,089
  • తమిళనాడు – 6,839
  • కర్ణాటక – 5,091
  • ఢిల్లీ – 4,347
  • ఆంధ్రప్రదేశ్ – 3,541

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =