తాజా ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే విజయానికి సంకేతం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయ ఆవరణలో జరిగిన విజయోత్సవ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే.. మార్చి 10 నుండి హోలీ ప్రారంభమవుతుందని మేము ముందే చెప్పాము. ఈ రోజును ‘ప్రజాస్వామ్య పండుగ’గా పేర్కొంటూ, యుపి, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్‌లలో బిజెపికి అనుకూలంగా ఓటు వేసినందుకు ఓటర్లకు ధన్యవాదాలు. పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేసినందుకు వచ్చిన ప్రతిఫలమే ఈ విజయం అని ప్రశంసించారు.
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పేదల అనుకూల పాలనా విధానాలకు ప్రజలు బలమైన ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. అవినీతి లేని పాలనను ప్రజలు కోరుకుంటున్నారని అందుకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ప్రధాని అన్నారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ కొత్త చరిత్రను లిఖించింది, రాష్ట్రంలో తొలిసారిగా ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది అని ప్రధాని మోదీ వెల్లడించారు. మేము 2019లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, 2017లో యూపీ విజయం కారణంగానే ఇది సాధ్యమైంది అని విశ్లేషకులు చెప్పారు. అదేవిధంగా.. ఇప్పుడు 2022 ఎన్నికల ఫలితాలు 2024 జాతీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అదే విశ్లేషకులు చెబుతారని నేను నమ్ముతున్నాను అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ