సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం – టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

TRS Will Fight Against The Privatisation of Singareni Coal Blocks Says MLC Kavitha, TRS Will Fight Against The Privatisation of Singareni Coal Blocks, MLC Kavitha Says TRS Will Fight Against The Privatisation of Singareni Coal Blocks, Privatisation of Singareni Coal Blocks, Singareni Coal Blocks, Singareni Coal Blocks Latest News, Singareni Coal Blocks Latest Updates, Singareni Coal Blocks Live Updates, TRS, Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Latest News, Privatisation of Singareni, MLC Kavitha, Kavitha, Mango News, Mango News Telugu,

తెలంగాణలోని సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో తనను కలిసిన సింగరేణి కార్మికుల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. బొగ్గు గనుల్లో ప్రమాదవశాత్తు మరణించిన సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నివాళులు అర్పించారు. సింగరేణి బొగ్గు గనులలోని బ్లాకులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. దీనిని టీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డుకుంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

గనులలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నదని తెలిపారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ స్పష్టమైన విధానంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కార్మికులకు 29 శాతం లాభాలను వాటాగా చెల్లించిన దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెంగర్ల మల్లయ్యకు కవిత నియామక పత్రం అందజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eighteen =