దివంగత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన నిరంతర కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ.. ‘స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన పోరాట యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఆయనకు ఘన నివాళులు. సమాజంలోని అణగారిన వర్గాలను అభివృద్ధి ప్రధాన స్రవంతితో అనుసంధానించడానికి ఆయన చేసిన కృషి ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.
आजादी की लड़ाई के सक्रिय सेनानी रहे पूर्व उप प्रधानमंत्री बाबू जगजीवन राम को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। समाज के वंचित वर्ग को विकास की मुख्यधारा से जोड़ने के उनके प्रयास सदैव प्रेरणास्रोत बने रहेंगे।
— Narendra Modi (@narendramodi) April 5, 2023
బాబూజీగా ప్రసిద్ధుడైన జగ్జీవన్ రామ్ 1908లో బీహార్‌లో జన్మించారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించారు.1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ మరియు ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. ఇక ఎమర్జెన్సీకి (1975-77 మధ్య కాలంలో) నిరసనగా కాంగ్రెస్‌ను వీడి జనతా పార్టీ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE