వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన అజెండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం – ఢిల్లీలో జనసేనాని పవన్ కల్యాణ్

Janasena President Pawan Kalyan Says We Will Not Let The Anti YSRCP Vote Split in AP,Janasena President Pawan Kalyan,We Will Not Let The Anti YSRCP Vote Split,Janasena President on Vote Split in AP,Pawan Kalyan on Anti YSRCP Vote Split,Mango News,Mango News Telugu,JSP-BJP alliance will have positive results,Pawan Kalyan wants AP to be free from YSR,Janasena President Latest News,Pawan Kalyan News Today,AP CM YS Jagan Mohan Reddy,TDP Chief Chandrababu Naidu,Janasena Chief Pawan Kalyan,BJP Party,YSR Party,TDP Party,JSP Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News

ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి విముక్తి చేయడమే తమ ఎజెండా అని, రాష్ట్రంలో ఆ పార్టీ పాలన లేకుండా చేయడమే తమ లక్ష్యమని, దీనికి బీజేపీ కూడా కట్టుబడి ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దాదాపు 50 నిమిషాల పాటు నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎలా అధికారంలోకి రావాలనే దానిపై చర్చించడమే తన ఢిల్లీ పర్యటన ఉద్దేశమని, దీనిలో భాగంగానే పలువురు బీజేపీ అగ్రనేతలను కలిశామని తెలిపారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై సమగ్రంగా చర్చించామని, వైసీపీ నాయకుల అవినీతి, అరాచకాలపై కూడా ప్రధానంగా తమ మధ్య చర్చ జరిగిందని తెలిపారు.

ఏపీలో జనసేన ఎలా అధికారం చేపట్టాలనేదే మా వ్యూహం..

అధికారం సాధించడానికే తాము అడుగులు వేస్తున్నామని, అయితే దానికోసం ఎలా వెళితే అది సాధ్యమవుతుందనే అంశంపై అన్ని కోణాల నుంచి విశ్లేషణలు చేస్తున్నామని పవన్ వివరించారు. ఇక పొత్తుల గురించి సమావేశంలో చర్చకు రాలేదని, కానీ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం అవ్వాలి, అధికారం ఎలా సాధించాలి అనే అంశాలపై మాత్రం చర్చించామని వెల్లడించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకూడదని బలంగా కోరుకుంటున్నానని, అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు బీజేపీ, జనసేన రెండు పార్టీలు కృషి చేస్తాయని స్పష్టం చేశారు. కాగా పవన్ కళ్యాణ్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా.. పలువురు బీజేపీ పెద్దలను, కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి, కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ మరియు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌ తదితరులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + fourteen =