దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. నివాళులర్పించిన ప్రధాని మోదీ

PM Modi Pays Tributes To Former Deputy Prime Minister Babu Jagjivan Ram on His Birth Anniversary Today,PM Modi Pays Tributes To Former Deputy Prime Minister,PM Modi Pays Tributes To Babu Jagjivan Ram,Babu Jagjivan Ram on His Birth Anniversary Today,Mango News,Mango News Telugu,Indian Prime Minister Narendra Modi,Jagjivan Ram Birth Anniversary,Narendra modi Latest News and Updates,Indian Political News,Babu Jagjivan Ram Latest News,Babu Jagjivan Ram Latest Updates,Babu Jagjivan Ram Live News

దివంగత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన నిరంతర కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ.. ‘స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన పోరాట యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఆయనకు ఘన నివాళులు. సమాజంలోని అణగారిన వర్గాలను అభివృద్ధి ప్రధాన స్రవంతితో అనుసంధానించడానికి ఆయన చేసిన కృషి ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

బాబూజీగా ప్రసిద్ధుడైన జగ్జీవన్ రామ్ 1908లో బీహార్‌లో జన్మించారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించారు.1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ మరియు ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. ఇక ఎమర్జెన్సీకి (1975-77 మధ్య కాలంలో) నిరసనగా కాంగ్రెస్‌ను వీడి జనతా పార్టీ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =