ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి రిషి సునాక్ తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా యూకే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు రిషి సునాక్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ “ఈరోజు రిషి సునాక్ తో మాట్లాడటం ఆనందంగా ఉంది. యూకే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు ఆయనకు అభినందనలు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కలిసి పని చేస్తాము. సమగ్ర మరియు సమతుల్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ) యొక్క ముందస్తు ముగింపు యొక్క ప్రాముఖ్యతపై కూడా మేము అంగీకరించాము” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అలాగే యూకే ప్రధాని రిషి సునాక్ ట్వీట్ చేస్తూ, “నేను నా కొత్త పాత్రను ప్రారంభించిన సందర్భంగా మీ మంచి మాటలకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. యూకే మరియు భారతదేశం చాలా షేర్ చేసుకుంటాయి. రాబోయే నెలలు మరియు సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య భద్రత, రక్షణ మరియు ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం ద్వారా ఈ రెండు గొప్ప ప్రజాస్వామ్యాలు సాధించబోయే దాని పట్ల సంతోషిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE