ఏప్రిల్‌ 1 నుండి నడకమార్గాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు: టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Divya Darshan will Resume on Trial basis at Alipiri Srivari Mettu Footpath Route from April 1st of for a Week YV Subba Reddy,Divya Darshan will Resume on Trial basis,Alipiri Srivari Mettu Footpath Route,Divya Darshan Footpath Route from April 1st of for a Week,Mango News,Mango News Telugu,YV Subba Reddy,TTD Chairman YV Subba Reddy,TTD to resume issuance of Divya Darshan,Divya Darshan or Footpath Darshan,Alipiri Srivari Mettu Latest News,Divya Darshan Latest Updates,TTD Chairman YV Subba Reddy Live News

తిరుమల శ్రీవారి భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటుగా అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆ తరువాత భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తిరుమలలో రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు.

ఏప్రిల్‌ 15 నుండి జూలై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లు తగ్గించనున్నామని, ఈ మూడు నెలల పాటు వీఐపీలు సిఫారసు లేఖలను తగ్గించాలని కోరారు. తద్వారా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్‌ పెయింట్‌ వేస్తామన్నారు.

తిరుమలలో 7500కు పైగా గదులు ఉన్నాయని, వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉందన్నారు. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించడం జరిగింది. ఇటీవల ప్రవేశపెట్టి ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం జరిగిందని ఛైర్మన్ తెలిపారు. “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్‌, పిఏసి`2, 4తోపాటు నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తాం. అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచుతాం. మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తాం. ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా సేవలందించేందుకు ఏర్పాట్లు చేశాం. భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుకుంటాం. టీటీడీ విజిలెన్స్‌, పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూస్తాం. శ్రీవారి సేవకులతో వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందిస్తాం” అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =