ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 28, మంగళవారం నాడు ఐఐటీ కాన్పూర్ స్నాతకోత్సవ వేడుకలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రసంగం కోసం ఐఐటీ కాన్పూర్, ఇతర ఐఐటీలు మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన విస్తారమైన ఐఐటీ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ ను తమ ఆలోచనలను పంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నాడు ప్రధాని మోదీ
ట్వీట్ చేశారు. “ఈ నెల 28వ తేదీన ఐఐటీ కాన్పూర్ స్నాతకోత్సవ(కాన్వొకేషన్) వేడుకలో ప్రసంగించేందుకు ఎదురుచూస్తున్నాను. ఇది ఒక శక్తివంతమైన సంస్థ, ఇది సైన్స్ మరియు ఆవిష్కరణలకు మార్గదర్శకంగా ఉంది. ఇందుకోసం సలహాలను పంచుకోవడానికి ప్రతి ఒక్కరినీ నేను ఆహ్వానిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ