ఢిల్లీ ఆర్డినెన్స్‌పై సీఎం కేసీఆర్‌ ఫైర్.. ముఖ్య‌మంత్రులు కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌లతో కలిసి మీడియా సమావేశం

CM KCR Fires on BJP Govt Against Delhi Ordinance in Media Conference with CMs Kejriwal and Bhagwant Mann,CM KCR Fires on BJP Govt,CM KCR Fires on BJP Govt Against Delhi Ordinance,CM KCR on Delhi Ordinance in Media Conference,BJP Govt Against Conference with CMs Kejriwal and Bhagwant Mann,CMs Kejriwal and Bhagwant Mann,Mango News,Mango News Telugu,Withdraw Delhi ordinance,Kejriwal to meet KCR,10 CMs skip NITI Aayog meeting,Delhi CM Kejriwal,Punjab CM Bhagwant Mann,CM KCR Latest News and Updates,CM Kejriwal Latest News,Punjab CM Bhagwant Mann Latest Updates

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావును కలుసుకున్నారు. శనివారం హైద‌రాబాద్‌కు వచ్చిన ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఐటీసీ కాక‌తీయ హోట‌ల్‌కు వెళ్లారు. అక్క‌డ్నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ గురించి సీఎం కేసీఆర్‌కు కేజ్రీవాల్ వివరించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిందిగా కోరారు. కాగా సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భ‌గ‌వంత్ మాన్‌, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో క‌లిసి వారు లంచ్ చేశారు. అనంతరం సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లతో కలిసి సీఎం కేసీఆర్ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు.

ఇక మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. భారత సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కార్ ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై ఆర్డినెన్స్‌ ఆర్డినెన్స్‌ తెచ్చిందని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. సుప్రీం తీర్పును ఆర్డినెన్స్‌ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని, దేశంలోని ప్రజస్వామ్యవాదులు అందరూ దీనిని ముక్త కంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్ర‌జాస్వామ్యబ‌ద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ప‌ని చేయ‌నీయ‌డం లేదని, చాలా రాష్ట్రాల్లో నాన్ బీజేపీ ప్ర‌భుత్వాలపై ర‌క‌ర‌కాల దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన జాతీయ పార్టీల‌ను మ‌ట్టిక‌రిపించి కేజ్రీవాల్ మూడుసార్లు బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీతో గెలిచారని, అందుకే మోదీ సర్కార్ ఢిల్లీలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ను తెచ్చి దుర్మార్గ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుందని అన్నారు. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వం కింద‌నే అధికారులంద‌రూ ప‌ని చేయాల్సి ఉంటుందని, దీనిపై స్పష్టంగా తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు జ‌డ్జిమెంట్‌ను కూడా ప్రత్యేక ఆర్డినెన్స్‌ల రూపంలో బుల్డోజ్ చేస్తున్నారని, దేశంలో మరోసారి ఎమ‌ర్జెన్సీ రోజులు గుర్తుకు వ‌స్తున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here