పీయూష్ గోయల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన మంత్రి హరీశ్‌రావు

Harish Rao Sensational Comments On Union Minister Piyush Goyal, Mango News, Minister Harish Rao, Minister Harish Rao Sensational Comments On Union Minister Piyush Goyal, Paddy Procurement, Paddy procurement issue, Paddy procurement issue in telangana, Piyush Goyal, Piyush Goyal Sensational Comments Over Paddy Procurement, Telangana Paddy procurement, Telangana paddy procurement centres, Union Minister, Union Minister Piyush Goyal, Union Minister Piyush Goyal Sensational Comments Over Paddy Procurement

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌పై ఫైర్‌ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులపై చేసిన కేంద్రమంత్రి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకమన్నారు. మా మంత్రులు 70లక్షల మంది రైతులు, నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున ఢిల్లీకి వచ్చారని తెలిపారు. రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తేవడానికి వారు ఢిల్లీ వరకు వస్తే, వారిని పని లేకే ఢిల్లీ వచ్చారని కేంద్రమంత్రి పరిహాసాలాడతారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు యావత్‌ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమేనని హరీష్ రావు అన్నారు. తెలంగాణలోని 70లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. వెంటనే పీయూష్‌ గోయల్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం రాష్ట్రంతో వ్యవహరించే తీరు సరిగా లేదని హరీష్ విమర్శించారు.

కేంద్రం తీరుతో రాష్ట్రంలోని 70లక్షల రైతు కుటుంబాలు ఆగమవుతున్నాయని, ఓ వైపు రైతులు పొలాల్లో కళ్లాల వద్ద పడిగాపులు పడుతున్నారు. రేపు రా రైస్‌ కూడా కొనమని చెతులెత్తేస్తే మా రైతుల పరిస్థితేంటని హరీష్ రావు ప్రశ్నించారు. మీరిచ్చిన 40లక్షల మెట్రిక్‌ టన్నుల కోటా పూర్తయ్యింది కాబట్టి ఇకపై ధాన్యం కొంటరా.. కొనరా.. అని అడిగేందుకే మంత్రుల బృందం ఢిల్లీకి వచ్చారన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి అభ్యర్థన చేసేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని అవమానపరచడం సరికాదన్నారు. మీరే రాజకీయం చేస్తూ.. మాపై నింద మోపుతున్నారని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల బృందం వస్తే, మూడు రోజులుగా కలిసేందుకు సమయం ఇవ్వకుండా రాజకీయం చేసింది కేంద్రమంత్రే అని హరీశ్‌రావు మండిపడ్డారు. ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయాన్ని రాతపూర్వకంగా చెప్పాలని రాష్ట్రం తరఫున అధికారికంగా బృందం వస్తే, స్పందించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టుకే తెలంగాణ జాతి, ప్రయోజనాల కోసమన్నారు. ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. మీకు మాత్రం రాజకీయాలే ముఖ్యమన్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =