ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 23, 24 తేదీలలో వర్చువల్ ఫార్మాట్‌లో చైనా నిర్వహించే 14వ బ్రిక్స్ సమ్మిట్ కు హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సమ్మిట్ లో భాగంగా జూన్ 24న అతిథి దేశాలతో గ్లోబల్ డెవలప్‌మెంట్‌పై ఉన్నత స్థాయి చర్చ ఉంటుందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ ఉమ్మడి ఆందోళన కలిగించే అంశాలపై చర్చించడానికి బ్రిక్స్ ఒక వేదికగా మారిందని, బ్రిక్స్ దేశాలు బహుపాక్షిక వ్యవస్థను మరింత ప్రాతినిధ్యంగా మరియు అందరినీ కలుపుకొని పోవడానికి దాని సంస్కరణలకు క్రమం తప్పకుండా పిలుపునిస్తున్నాయని చెప్పారు.
14వ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా జరిగే చర్చల్లో తీవ్రవాద వ్యతిరేకత, వాణిజ్యం, ఆరోగ్యం, సాంప్రదాయ వైద్యం, పర్యావరణం, ఎస్ అండ్ టీ అండ్ ఇన్నోవేషన్స్, వ్యవసాయం, సాంకేతిక, వృత్తి విద్య అండ్ శిక్షణ మరియు ఎంఎస్ఎంఈలు వంటి రంగాలలో బ్రిక్స్ అంతర్గత సహకారాన్ని కవర్ చేయాలని భావిస్తున్నారు. బహుపాక్షిక వ్యవస్థ యొక్క సంస్కరణ, కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడం మరియు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ వంటి అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు బ్రిక్స్ సమ్మిట్‌కు ముందు జూన్ 22న బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ ప్రారంభోత్సవంలో రికార్డ్ చేయబడిన కీలక ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ పాల్గొంటారని కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY