పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేడు (డిసెంబర్ 20, మంగళవారం) హైదరాబాద్ లో పర్యటించనున్నారు. నగరంలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సులో సీఎం భగవంత్ మాన్ పాల్గొననున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రగతిభవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సీఎం భగవంత్ మాన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సహా పలు ఇతర అంశాలపై ఇరువురూ సీఎంలు చర్చించనున్నట్టు తెలుస్తుంది. అనంతరం సీఎం భగవంత్ మాన్ సదస్సులో భాగంగా పారిశ్రామికవేత్తలతో సమావేశమై, ఫిబ్రవరి నెలలో మొహాలిలో జరగనున్న ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE







































