రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్ సోమవారం భారత నూతన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా అరుణ్ గోయెల్ నవంబర్ 19న భారత ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. సాధారణంగా భారత ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు కమీషనర్లు ఉంటారు. అయితే ఈ ఏడాది మే నెలలో సుశీల్ చంద్ర చీఫ్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఒక ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానంలో కేంద్రం అరుణ్ గోయెల్ ను నియమించింది. పంజాబ్ కేడర్‌కు చెందిన గోయెల్ భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసి ఆ పదవి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. డిసెంబర్ 31, 2022న పదవీ విరమణ చేయనున్న గోయెల్ గత శుక్రవారమే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం విశేషం.
గతంలో ఆయన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా మరియు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. గోయల్ ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మరియు ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండేతో ఎన్నికల ప్యానెల్‌లో చేరనున్నారు. ఇక డిసెంబర్ 2027 వరకు గోయెల్ పదవిలో కొనసాగనున్నారు. ఎన్నికల కమీషనర్ల నియామకం, సర్వీస్ షరతులు మరియు పదవీ విరమణను నియంత్రించే చట్టం ప్రకారం, ఒక వ్యక్తి ఆరు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు, ఏది మొదట వచ్చినా ఈసీ లేదా సీఈసీగా పనిచేయవచ్చు. ఇక రాబోయే కొన్ని నెలల్లో, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర మరియు కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించే బాధ్యత పూర్తి స్థాయి పోల్ ప్యానెల్‌పై ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE