ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉగ్రవాదుల కుట్రను ఛేదించిన బీహార్ పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్

ihar Police Detains Two Suspected Terrorists Over Uncover Plot To Target PM Narendra Modi, Uncover Plot To Target PM Narendra Modi, Bihar Police Detains Two Suspected Terrorists, Two Suspected Terrorists, Terrorists, Bihar cops uncover plot to target PM Narendra Modi, suspected terrorist module has been busted in Patna and two suspected terrorists have been arrested, Bihar terror module, Bihar cops uncover plot to target PM Narendra Modi, Bihar Police, Uncover Plot To Target PM Modi, Bihar Terrorist Module News, Bihar Terrorist Module Latest News, Bihar Terrorist Module Latest Updates, Bihar Terrorist Module Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఆయనను హత్య చేసేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు బీహార్ పోలీసులు గురువారం ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. జులై 12వ తేదీన రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఈరోజు బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ కుట్రకు తెరలేపినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ప్రధాని మోదీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందారని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో జులై 6, 7 తేదీల్లో ప్రధాని మోదీ లక్ష్యంగా ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా సమావేశాలు జరిపారు. ఈమేరకు ఇంటెలిజెన్స్ బ్యూరోకు పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద మాడ్యూల్ పనిచేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పాట్నా నగరంలో ఉగ్రవాదులైన అథర్ పర్వేజ్, ఎండీ జలాలుద్దీన్ లను పోలీసులు అరెస్టు చేశారు. కేరళ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి యువకులను ఉగ్రవాద శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడికి తీసుకుని వచ్చేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fifteen =