టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తి.. ఒక్కసారిగా ప్రపంచం అల్లకల్లోలం అయిన విషయం తెలిసిందే. బ్లూ స్క్రీన్ ఎర్రర్‌తో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లు మెరాయించాయి. దీంతో ఒక్కసారిగా ప్రపంచం స్తంభించి పోయింది. ప్రపంచ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్‌తో పని చేసే లక్ష్యలాది కంప్యూటర్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. వినియోగదారులు తిరిగి తమ కంప్యూటర్లను ఆన్ చేయగా.. స్క్రీన్‌పై ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్’ అని కనిపించింది. అలాగే ‘మీ కంప్యూటర్‌ను రీ స్టార్ చేయండి’ అనే ఆప్షన్ కనిపించడంతో అంతా తమ తమ కంప్యూటర్లను రీ స్టార్ చేశారు. అయితే అలా ఎన్నిసార్లు చేసినా అదే సమస్య తలెత్తడంతో.. వినియోగదారులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోయాయి. పలు ఐటీ సంస్థలు ఆఫీసులకు హాలీడే ప్రకటించాయి. బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ సాంకేతిక సమస్య వల్ల పలు విమానయాన సంస్థలు కూడా ఫ్లైట్లను క్యాన్సిల్ చేశాయి. ఒక్క ఇండిగో విమాన సంస్థనే శుక్రవారం రెండు వందలకు పైగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పలు చోట్ల మెట్రో సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రుల్లోనూ అంతరాయం ఏర్పడింది. భారత్, అమెరికా, చైనా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సమస్యను ఎదుర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్‌ను ఉపయోగించే అన్ని సంస్థలు ఎఫెక్ట్ అయ్యాయి.
అయితే ఈ సమస్యపై మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల స్పందిస్తూ.. సాంకేతిక సమస్యకు గల కారణాలను వెల్లడించారు. క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్డేట్ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్తిందని వెల్లడించారు. ఈ సమస్యకు సంబంధించి క్రౌడ్ స్టైక్‌తో కలిసి పని చేస్తున్నామని.. కస్టమర్లకు అవసరమైన సాంకేతిక సహాయం, మద్ధతు సమకూర్చేలా, కంప్యూటర్లను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో సత్య నాదెళ్ల పోస్టు పెట్టారు.
Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.
— Satya Nadella (@satyanadella) July 19, 2024
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE