అగ్నిపథ్ పథకం: చరిత్ర సృష్టించిన భారత నౌకాదళం, 341 మంది మహిళా నావికుల నియామకం

Agniveer Scheme Indian Navy Inducts 341 Women Sailors For The First Time in History, Indian Navy Inducts 341 Women Sailors For The First Time in History, 341 Women Sailors, Agniveer Scheme Indian Navy, Women sailors join Indian Navy, 341 women Agniveers, Agniveer Scheme News, Agniveer Scheme Latest News, Agniveer Scheme Live Updates, Mango News, Mango News Telugu

భారత నావికాదళం సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారిగా 341 మంది మహిళలను నావికాదళంలోకి తీసుకున్నారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా ‘అగ్నివీర్’లుగా వీరిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ మేరకు నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ అధికారికంగా ప్రకటించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2047 నాటికి భారత నావికాదళం ‘ఆత్మనిర్భర్’ గా మారుతుందని ప్రభుత్వానికి హామీ ఇచ్చామని, దీనిలో భాగంగా సిబ్బంది సంఖ్యను పెంచుకుంటున్నామని తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో వివిధ చైనా సైనిక మరియు పరిశోధనా నౌకల కదలికలపై నావికాదళం గట్టి నిఘా ఉంచుతుందని ఆయన అన్నారు.

ఇంకా చీఫ్ అడ్మిరల్ మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో భారత నావికాదళం చాలా అధిక కార్యాచరణను సాధించిందని, భారతదేశం ముందుకు సాగుతున్నందున సముద్ర భద్రతపై ఎక్కువ ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు. అలాగే విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించడం భారతదేశానికి ఒక మైలురాయి అని ఆయన అన్నారు. దాదాపు 3,000 మంది అగ్నివీరులు నౌకాదళంలోకి వచ్చారు, వారిలో 341 మంది మహిళలు ఉన్నారు. తొలిసారిగా మహిళా నావికులను ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. మహిళా సిబ్బందికి నేవీకి సంబంధించిన పూర్తి శిక్షణ అందిస్తున్నామని, అవసరాలకు అనుగుణంగా వారి సేవలను వినియోగించుకుంటామని అడ్మిరల్ కుమార్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here