ఇండియా vs ఇంగ్లాండ్ 5వ టెస్ట్: భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరో రికార్డ్

Ind vs Eng 5th Test Team India Wicket Keeper cum Batsman Rishabh Pant Breaks 69-Year Old Batting Record, Team India Wicket Keeper cum Batsman Rishabh Pant Breaks 69-Year Old Batting Record, Batsman Rishabh Pant Breaks 69-Year Old Batting Record, Team India Wicket Keeper Rishabh Pant Breaks 69-Year Old Batting Record, Rishabh Pant Breaks 69-Year Old Batting Record, 69-Year Old Batting Record, Rishabh Pant has become the youngest wicket-keeper batter to score 2000 Test runs, youngest wicket-keeper batter to score 2000 Test runs, 2000 Test runs, youngest wicket-keeper, Batsman Rishabh Pant, Team India Wicket Keeper Rishabh Pant, Rishabh Pant, Ind vs Eng 5th Test News, Ind vs Eng 5th Test Latest News, Ind vs Eng 5th Test Latest Updates, Ind vs Eng 5th Test Live Updates, Mango News, Mango News Telugu,

టెస్టు క్రికెట్‌లో రిషభ్ పంత్‌ మరో రికార్డు సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ చేశాడు. తద్వారా ఒకే టెస్టులో సెంచరీ మరియు అర్ద సెంచరీ సాధించిన రెండో భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 111 బంతుల్లో 146 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 76 బంతుల్లో 57 పరుగులు సాధించాడు. దీంతో మొత్తం 203 పరుగులతో  ఆసియా వెలుపల ఒకే టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ వికెట్ కీపర్‌ గా రిషభ్ పంత్ నిలిచాడు.

ఈ క్రమంలో పంత్ 1953లో వెస్టిండీస్‌పై కింగ్‌స్టన్‌లో విజయ్ మంజ్రేకర్ స్కోర్ చేసిన 161 పరుగుల మునుపటి రికార్డును రిషభ్ బద్దలు కొట్టాడు. ఇక పంత్ కు ముందు 1973లో భారత దిగ్గజ ఆటగాడు, మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూఖ్ ఇంజనీర్ ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా సెంచరీ, అర్ద సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు , రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేశాడు ఫరూఖ్. ఇక ఇదే క్రమంలో ఒకే టెస్టులో అ‍త్యధిక పరుగులు చేసిన మూడో భారత వికెట్‌ కీపర్‌గా కూడా పంత్‌ (203) రికార్డు సాధించాడు. 230 పరుగులతో బుద్ధి కుందరన్ మొదటి స్ధానంలో ఉండగా, ఎంస్ ధోని 224 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here