పాకిస్థాన్.. హింసతో పుట్టిన దేశం. ఎప్పుడూ హింసను ప్రేరేపించే దేశం. అక్కడి పాలకులు కూడా ప్రతీకారం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. నిత్యం భారత్‌పై కారుకూతలు కూసే పాక్.. అర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మరోసారి అక్కసును వెల్లగక్కింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు చట్టబద్ధత లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ.. భారత ప్రభుత్వం 2019లో తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించలేదని కారుకూతలు కూసింది పాక్.
లక్షలాది మంది కశ్మీరీల త్యాగానిక భారత సుప్రీంకోర్టు ద్రోహం చేసిందని పాక్ మాజీ ప్రధాని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం ద్వారా భారత సుప్రీంకోర్టు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించారు. సుప్రీం తీర్పుతో.. కశ్మీరీ స్వాతంత్య్ర పోరాటం మరింత బలపడిందని.. కశ్మీరీ పోరాటంలో వెనుకడుగు వేయకుండా పోరాడుతామని రెచ్చగెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు 2019 ఆగష్టు 5న భారత ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, చట్టవిరుద్ధమైన చర్యలను అంతర్జాతీయ చట్టం గుర్తించలేదని పాక్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిల్లానీ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అంతర్జాతీయంగా చట్టపరమైన విలువలేదని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నిర్ణయాలకు అనుగుణంగా కశ్మీరీలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని అన్నారు.
ఇకపోతే 2019లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానిక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్లపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం.. సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అలాగే పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేమనని తేల్చి చెప్పింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE