కోట్లాది మంది భారతీయలు ఎంతో భక్తిగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే అయోధ్యలో రాముడి విగ్రహం..ప్రతిష్టించబోతోన్నారు. అయితే అయోధ్యలో రూపుదిద్దుకున్న రామమందిరంలో కొలువుదీరనున్న రాముడు ఎలా ఉంటాడో తెలిసింది. రామ మందిరంలో ఐదేళ్ల వయసున్న చిన్నిరాముడి విగ్రహానికి జనవరి 22న గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం అన్ని ఏర్పాట్లు రెడీ అయ్యాయి .
అయోధ్యలో బాలరాముడి విగ్రహం నమూనాను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఖరారు చేసింది. అయితే దీనికోసం మూడు విగ్రహ నమూనాలను ట్రస్ట్ సభ్యులు పరిశీలించారు. ఐదేళ్ల వయసున్న రాముడి విగ్రహానికి, దైవత్వం ఉట్టిపడేలా ఉన్న అద్భుత శిల్పాన్ని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ప్రతిష్టించబోయే విగ్రహం ఎంపిక చేసిన నమూనాను ఇంకా ప్రకటించలేదు. విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసిన రోజే ఆ విగ్రహాన్ని చూడటానికి వీలవుతుంది.
అయితే అయోధ్య రామమందిరంలో ప్రతిష్టించే రాముడు ఎలా ఉంటాడు.. ఆయన రూపం ఎలా ఉంటుందనే విషయాలు మాత్రం ఖరారయ్యాయి. అయోధ్యలో కొలువుదీరబోయే రాముడు, శ్యామవర్ణంలో ఉంటాడు. మనం ఇప్పటి వరకూ సినిమాలు, ఫోటోలలో చూసే రాముడి రంగే ఈ విగ్రహానికి కూడా ఉంటుంది. దీనివల్ల రాముడి పౌరాణిక, చారిత్రక వైభవానికి తగినట్లుగా రాముని రూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. దీని ప్రకారం జనవరి 22న శ్యామవర్ణంలోని బాలరాముడిని అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నారు.
ఇక అయోధ్య రాముడి అపురూపమైన విగ్రహం 51 అంగుళాల ఎత్తులో ఉండబోతోంద. 51 అంగుళాలు అంటే.. సుమారు నాలుగు అడుగులకు కాస్త ఎక్కువగా ఉంటుంది. రాముని విగ్రహాన్ని రూపొందించిన వ్యక్తి పేరు అరుణ్ యోగిరాజ్.ఇతను మైసూరుకు చెందిన శిల్పి. అరుణ్ యోగిరాజ్ ఆషామాషీ వ్యక్తి కాదు. కేదార్‌నాథ్‌లో ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించిన ఆదిశంకరాచార్యుని విగ్రహాన్ని కూడా మలిచింది ఈ శిల్పే.అలాగే ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించారట.
అయోధ్యలో ప్రతిష్ఠించబోయే బాల రాముడి విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్, ఆరునెలల్లోనే తయారుచేశారట. రాముడి దైవత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబేలా ఈ విగ్రహాన్ని మలిచారని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. అయితే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ముందుగా మూడు విగ్రహాలను పరిశీలించి..వాటిలో యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ఫైనల్ చేసింది. అయితే ఈ మూడు విగ్రహాల్లో ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచగా.. మరో రెండు విగ్రహాలను కూడా అయోధ్య ఆలయంలోనే ప్రతిష్టించడానికి ట్రస్ట్ సభ్యులు నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE