అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరు మహిళా ఎంపీలు పోటీ

Those Two Women MPs Are Contesting In The Assembly Elections, Two Women MPs Are Contesting, Assembly Elections Two Women MPs Are Contesting, Assembly Elections Two Women MPs, CM Jagan, YCP, Assembly Elections, MPS, AP, Latest YCP Two Women MPs News, YCP Two Women MPs News Update, CM Jagan, YCP Party, AP MP Elections, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
CM Jagan, YCP, Assembly elections, MPS, AP

సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలవేళ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. అభ్యర్థుల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెగిటివిటీవున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఏమాత్రం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటికే 11 మంది సిట్టింగ్‌లకు షాక్ ఇచ్చిన జగన్.. మరో 50 నుంచి 60 మందిని కూడా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు.

చీపురుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణను ఈసారి పార్లమెంట్‌కు పంపించాలని జగన్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా.. విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకుంటున్నారు. ఇదే సమయంలో అటు కొందరు ఎంపీలను కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళా ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారట.

అల్లూరి జిల్లాకు చెందిన గొడ్డేటి మాధవి ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మాధవి రెండున్నర లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎంపీ అయిన తర్వత తన పని తనంతో మాధవి ప్రజల మన్ననలు పొందారు. ఈక్రమంలో మాధవిని ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారట. ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని పక్కన పెట్టి.. గొడ్డేటి మాధవిని అక్కడి నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారట. పాడేరు నియోజకవర్గంలో భాగ్యలక్ష్మిపై వ్యతిరేకత పెరిగిపోవడంతో.. ఆమెకు షాక్ ఇచ్చి మాధవిని బరిలోకి దింపాలని జగన్ అనుకుంటున్నారట.

అలాగ అనకాపల్లి ఎంపీ ఎంపీ భీశెట్టి సత్యవతిని కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపాలని జగన్ అనుకుంటున్నారట. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సత్యవతిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఆయన్ను చోడవరం నుంచి పోటీ చేయించనున్నారట. సత్యవతి బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు.. నియోజకవర్గంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈక్రమంలో అమర్నాథ్‌ను చోడవరంకు పంపించి సత్యవతిని అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట. త్వరలో విడదల చేయబోయే వైసీపీ రెండో జాబితాలో ఈ ఇద్దరు మహిళా ఎంపీలు పేర్లు ఉండనున్నాయట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =