కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, మిషన్ కర్మయోగి కి ఆమోదం

Cabinet approves Karmayogi scheme, Karmayogi scheme, Mission Karmayogi, Mission Karmayogi for civil servants, Mission Karmayogi Scheme, Modi Cabinet, Narendra Modi govt, Union Cabinet, Union Cabinet Approves Mission Karmayogi Scheme, What is Mission Karmayogi

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • ‘‘మిషన్ కర్మయోగి-నేషనల్ ప్రోగ్రాం ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్’’ కి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సివిల్ సర్వీసుల సామర్థ్య పెంపునకు ఉద్దేశించి ఈ జాతీయ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. వ్యక్తిగత, సంస్థల స్థాయిలో మెరుగైన ప్రజా సేవలను అందించడానికి వీలుగా, సామర్థ్య పెంపు దిశ లో సమగ్రమైన సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఈ కార్యక్రమం దోహదపడనుంది.
  • భూగ‌ర్భ‌, ఖ‌నిజ‌వ‌న‌రుల రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి ఇండియా, ఫిన్లాండ్‌ల మ‌ధ్య అవ‌గాహ‌నా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.
  • నాణ్యమైన వస్త్ర రంగంలో సహకారం కోసం ఇండియా మరియు జపాన్ మధ్య అవగాహన ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
  • జమ్మూ కశ్మీర్‌లో డోంగ్రి, హిందీ, కశ్మీరీ లను అధికార భాషలుగా గుర్తించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu