అన్‌లాక్‌ 4.0: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లు ప్రారంభం

Coronavirus Lockdown, India Unlock 4, india unlock 4 india, India Unlock 4.0, India Unlock 4.0 News, India’s Unlock 4.0 Amid COVID 19, Indian Government, Metro Rail Services, Metro Rail Services Starts From September 7 th, Metro Rail Services Updates, unlock 4, unlock 4 guidelines, unlock 4 guidelines india, unlock 4 india, Unlock 4.0 guidelines

కేంద్రప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్ల సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గత మార్చ్ 22 న లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో మెట్రో సేవలపై కేంద్రం నిషేధం విధించింది. తాజాగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మెట్రో రైళ్ల సేవలు ప్రారంభించనున్నారు. మెట్రో సేవలు గ్రేడెడ్ పద్ధతిలో నిర్వహించబడతాయని, ఇందుకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేస్తుందని కేంద్ర హోమ్ శాఖ ప్రకటించింది. మరోవైపు స్కూళ్లు, విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ పై సెప్టెంబర్ 30 వరకు నిషేధాన్ని పొడిగించారు. అలాగే దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =