మిలియన్ల బిలియన్ల సంవత్సరాలలో భూమి లోతుల వద్ద అపారమైన ఒత్తిడిలో వజ్రాలు ఏర్పడి..అవి కొన్ని అగ్నిపర్వత ప్రక్రియల ద్వారా భూమి క్రస్ట్‌లో కేవలం 100 కిలోమీటర్ల లోతు వరకూ వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే కొత్త అధ్యయనంలో, దీనికి కారణం ఖండాలను విచ్ఛిన్నం చేసే ప్రాసెస్ అని శాస్త్రవేత్తలు తేల్చారు.
వజ్రాలు భూమి ఉపరితలం క్రింద ఉన్న అపారమైన ఒత్తిడి వల్ల ఏర్పడతాయి. చాలా వజ్రాలు వందల ఏళ్ల నుంచి బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. సాధారణంగా వజ్రాలు కింబర్లైట్ అని పిలువబడే అగ్ని శిలలలో కనిపిస్తాయట. ఈ శిలలు ఖండాలలో బాగా బలమైన, దట్టమైన భాగాలలో కనిపిస్తాయి. 19వ శతాబ్దంలో వజ్రాల ఆవిష్కరణ కోసం పోటీ జరిగిన దక్షిణాఫ్రికాలో దీనికి ఉదాహరణగా చూడొచ్చు. అయితే అంత కింద ఉండే వజ్రాలు .. భూ ఉపరితలం పైకి ఎలా చేరుకుంటాయనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ రీసెర్చర్స్ నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో, వజ్రాలు ఏర్పడటానికి టెక్టోనిక్ ప్లేట్ చీలిక కీలకమైన అంశం అనీ.. వజ్రాలు ఎక్కువగా ఉండే శిలాద్రవం భూమి ఉపరితలంపైకి రావడానికి మెయిన్ రీజన్ అని కనుగొన్నారు. ఖండాలు విడిపోయినప్పుడు కింబర్లైట్ శిలాద్రవం ఎలా క్రియేట్ చేయబడుతుందో.. వివరించగల డొమినో ఎఫెక్టును పరిశోధకులు కనుగొన్నారని అధ్యయనంలో చెప్పారు.
ఖండాలు విడిపోయిన సమయంలో, కాంటినెంటల్ కోర్లో చిన్న భాగం వేరు చేయబడి, దిగువ మాంటిల్లోకి మునిగిపోతుందనీ.. ఇదే కాంటినెంటల్ షెల్ఫ్ చుట్టూ ఫ్లో పేటర్న్ను ప్రేరేపిస్తుందని అధ్యయనం చెబుతోంది. దీని కోసం, ఖండాల విచ్ఛిన్నం ఇంకా కింబర్లైట్ వాల్కలైన్ యాక్టివిటీస్ మధ్య సంబంధాన్ని పరిశోధించడానికి.. గణాంక విశ్లేషణ ఇంకా యంత్ర అభ్యాస అల్గారిథమ్‌లను నిపుణులు ఉపయోగించారు.
భూమి ఖండాల ప్రారంభ టెక్టోనిక్ విచ్ఛిన్నమయ్యాక.. 2 నుంచి 30 మిలియన్ సంవత్సరాల తర్వాత చాలా కింబర్లైట్ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయని పరిశోధనలు చెప్పాయి. జియోస్పేషియల్ అనాలసిస్ ద్వారా, కింబర్లైడ్ విస్ఫోటనాలు ఖండాల అంచుల నుంచి లోపలి వైపునకు వెళ్లడానికి ప్రయత్నిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు.
వీటన్నింటికీ ఏ భౌగోళిక ప్రాసెస్ కారణమో తెలుసుకోవడానికి..ఈ రిజల్ట్ శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడింది. భూమి క్రస్ట్, కోర్ మధ్య ఉష్ణప్రసరణ పొర అయిన మాంటిల్ ఈ చీలిక వల్లే క్షీణించినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇది వేల కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరుగుతుండగా… ఇది ఖండాల విచ్చిన్నం.. కింబర్లైట్ శిలాద్రవం ఏర్పడటానికి ఎలా కారణమవుతుందో వివరిస్తూనే.. డొమినో ప్రభావానికి దారితీస్తుందని గుర్తించారు. అయితే అంతకు ముందు డైమండ్స్‌ను ఉపరితలం పైకి తీసుకొచ్చే ప్రాసెస్ ఏ రీజన్‌తో జరిగిందో రీసెర్చర్స్‌కు కూడా తెలియదు. లక్షలాది బిలియన్ల ఇయర్స్ చాలా లోతులో ఉండి, భూమి యొక్క ఉపరితలం నుంచి 150 కిలోమీటర్ల దిగువన ఇదంతా జరుగుతుంది.
ఈ ప్రాసెస్‌లతో అనుబంధించబడిన గత వాల్కనిక్ విస్ఫోటనాల సైట్లను గుర్తించడానికి ఈ రిజల్ట్ ఉపయోగించబడతాయి. ఇది మాత్రమే కాదు, ఇది గతంలో జరిగిన అగ్నిపర్వతాల సమయాన్ని.. అలాగే భవిష్యత్తులో అగ్నిపర్వత విస్ఫోటనాల టైమును కూడా గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. అలాగే ఇది భవిష్యత్తులో వజ్రాల నిక్షేపాలను కనుగొనడంలో సహాయపడుతుందని నేచర్ జర్నల్‌లో ప్రచురించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE