ట్రైన్ టికెట్ ఉందని ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ గంటలు ఉండిపోతున్నారా? అయితే ఫైన్ తప్పదు

Everything You Need To Know About Platform Ticket Rules and Validity Time at Indian Railway Stations,Everything You Need To Know About Platform Ticket Rules,Know About Platform Ticket Rules,Mango News,Mango News Telugu,Validity Time at Indian Railway Stations,Indian Railways, Staying on the platform for long hours, to have a train ticket?, Railway Station,Indian Railway Stations Latest News,Indian Railway Stations Latest Updates,Indian Railway Stations Live News,Platform Ticket Rules News Today,Platform Ticket Rules Latest Updates

ఇండియన్ రైల్వేలు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయన్న విషయం తెలిసిందే. సౌకర్యవంతంగా, చౌకగా ఉండటంతో.. లాంగ్ జర్నీలకు ఇప్పటికీ రైల్వేలపైనే ఎక్కువ మంది ఆధారపడతారు. అయితే రైలు ప్రయాణంలో చాలా నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది.వాటిలో ప్లాట్‌ఫామ్‌పై రైలు కోసం వేచి ఉండే నిబంధన చాలామందికి తెలియదు. ఈ నియమాలను పాటించకపోతే జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది.

ట్రైన్ ‌లో ప్రయాణించడానికి చాలామంది చాలా సమయం ఉన్నా ముందే రైల్వే స్టేషన్‌ కు చేరుకుని ప్లాట్‌ఫామ్‌ మీద వెయిట్ చేస్తుంటారు. అయితే టికెట్ తీసుకున్నాం కదా అని ఎంతసేపయినా రిలాక్సయిపోదామనుకుంటే భారీ జరీమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. టికెట్ కొన్న తర్వాత కూడా ప్లాట్‌ఫామ్‌పై వెయిట్ చేయడానికి టైమ్ లిమిట్ ఉంటుంది.

అవును..వెయిటింగ్ టైమ్ గురించి చాలామందికి అవగాహన ఉండదు.టికెట్ కొన్నామా.. ప్లాట్ ఫామ్ మీద వెయిట్ చేశామా అని గంటలు గంటలు కూర్చుంటారు. కానీ రైల్వే పోలీసులకు ఇలా చిక్కారో.. వారి పని అవుట్. భారీ ఫైన్ కట్టి మరీ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఈ నియమం పగలు, రాత్రి ఆధారంగా ఉంటుంది.

మీ ట్రైన్ డే టైములో ఉంటే మీరు ట్రైన్ వచ్చే సమయానికి రెండు గంటల ముందు స్టేషన్‌కు చేరుకోవచ్చు. అదే మీ ట్రైన్ రాత్రిపూట ఉంటే కనుక.. ట్రైన్ టైమింగ్స్‌కు 6 గంటల ముందు వరకూ స్టేషన్‌కు చేరుకోవచ్చు. రాత్రి సమయంలో రైల్వే స్టేషన్ కు చేరుకుని ప్లాట్‌ఫామ్‌పై వెయిట్ చేస్తున్నప్పుడు ఎలాంటి జరీమానా చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ట్రైన్ దిగి గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా ఇదే నియమం వర్తిస్తుంది. రైలు వచ్చిన తర్వాత గరిష్టంగా 2 గంటల వరకు స్టేషన్‌లో ఉండొచ్చు. అయితే కనుక రాత్రి సమయమైతే 6 గంటల వరకూ ఉండేందుకు రైల్వే అనుమతిస్తుంది.

ఇలా వెయిట్ చేస్తున్నప్పుడు రైల్వే పోలీసులు ప్రశ్నిస్తే.. TTE డిమాండ్‌పై రైలు టికెట్‌ను చూపించాలి. నిర్ణీత సమయానికి మించి రైల్వే స్టేషన్‌లో వెయిట్ చేయాల్సి వస్తే.. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పగటిపూట రైలు సమయం నుంచి రెండు గంటలకు పైగా.. రాత్రి రైలు సమయంలో అయితే 6 గంటలకు మించి స్టేషన్‌లో ఉంటే కనుక ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకోవాలి లేదంటే.. TTE మీకు భారీగా జరిమానా విధిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − four =