నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఆకస్మిక రాజీనామా.. కొత్తగా సుమన్‌ కే బెరీని నియమించిన కేంద్ర ప్రభుత్వం

NITI Aayog Vice Chairman Rajiv Kumar Steps Down Suman K Bery To Take The Charge Next, NITI Aayog Vice Chairman Rajiv Kumar Steps Down, Suman K Bery To Take The NITI Aayog Vice Chairman Charge Next, NITI Aayog Vice Chairman, Suman K Bery New NITI Aayog Vice Chairman, Suman K Bery, New NITI Aayog Vice Chairman, Niti Aayog VC Rajiv Kumar steps down, Suman K Bery To Take The NITI Aayog Vice Chairman Charge Next from May 1, NITI Aayog Vice Chairman News, NITI Aayog Vice Chairman Latest News, NITI Aayog Vice Chairman Latest Updates, NITI Aayog Vice Chairman Live Updates, Niti Aayog New VC, Mango News, Mango News Telugu,

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. అయితే రాజీవ్ కుమార్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా సుమన్ కె బేరీని ప్రభుత్వం నియమించింది. రాజీవ్ కుమార్ రాజీనామా ఆమోదించబడిందని, ఆయన ఏప్రిల్ 30న పదవి నుండి రిలీవ్ చేయబడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అరవింద్ పనగారియా స్థానంలో రాజీవ్ కుమార్ ఆగస్టు 2017లో వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయం, అసెట్ మానిటైజేషన్, డిజిన్వెస్ట్‌మెంట్, ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం మరియు ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటిపై దృష్టి సారించి, నీతి ఆయోగ్ విధాన రూపకల్పనలో రాజీవ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో DPhil మరియు లక్నో విశ్వవిద్యాలయం నుండి PhD పట్టా పొందారు.

సుమన్ బెరీ మే 1 నుండి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలిపింది. సుమన్ బెరీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) మాజీ డైరెక్టర్ జనరల్. ఆయన 2001 నుండి 2011 వరకు ఒక దశాబ్ద కాలం పాటు ఆ పదవిలో కొనసాగారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క టెక్నికల్ ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా కూడా పనిచేశారు. సలహా కమిటీ మరియు నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ సభ్యుడిగా సేవలందించారు. సుమన్ బెరీకి ప్రపంచ బ్యాంక్‌లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, మరియు పొలిటికల్ మానేజ్మెంట్ లలో పట్టా అందుకున్నారు. ఇంకా ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలోని వుడ్రో విల్సన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నుండి పబ్లిక్ అఫైర్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =