ఇన్నేళ్లకి ప్రపంచకప్ ని ముద్దాడిన ఇంగ్లాండ్

Mango news, England Defeats New Zealand in Cricket World Cup Final, England beat New Zealand to win first World Cup, England win Cricket World Cup against New Zealand, winner in World Cup 2019, England defeats New Zealand in astonishing Cricket World Cup final, ICC CWC 2019 final England script history , England vs New Zealand, World Cup Final Latest News

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ కప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. చివరి వరకు ఎవరు గెలుస్తారో ఊహించని విధంగా, నరాలు తెగేంత ఉత్కంఠ తో సాగిన ఈ మ్యాచ్ లో, ఇంగ్లాండ్ విజయాన్ని దక్కించుకుంది. క్రికెట్ కి పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్, ఇన్నాళ్ళకి జగజ్జేత గా నిలిచి, ప్రపంచ కప్ ని ముద్దాడింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ చేసిన పోరాటానికి క్రికెట్ అభిమానులు ముగ్దులయ్యారు, వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్లో పరాజయం పొందడంతో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు నిరాశలో మునిపోయారు.

జూలై 14, ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ జట్టు, 241 పరుగులు కి ఆల్ అవుట్ అయ్యింది. తరువాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మ్యాచ్ మధ్యలో, పరుగుల ఛేదనలో తడబడిన కూడ, బెన్ స్టోక్స్ (84) నాటౌట్ అద్భుత పోరాటంతో 50 ఓవర్ల కి 10 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసి, మ్యాచ్ ను టై చేసింది. తరువాత సూపర్ ఓవర్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి, న్యూజిలాండ్‌ జట్టు కు 16 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది, తదనంతరం, న్యూజిలాండ్‌ జట్టు 15 పరుగులు సాధించి, సూపర్ ఓవర్ కూడ టై చేయగా, ఐసీసీ రూల్స్ ప్రకారం ఈ మ్యాచ్ లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.

ఈ సంవత్సరం, ఐసిసి ప్రపంచ కప్‌ను ఇంగ్లాండ్ నిర్వహించింది, ఇది మే 30 న ప్రారంభమై, జూలై 14 న జరిగిన అద్భుతమైన మ్యాచ్ తో ముగిసింది.  ఫైనల్ మ్యాచ్‌లో 98 బంతుల్లో 84 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను విజయతీరాలకు చేర్చిన ఆటగాడు బెన్ స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరోవైపు, టోర్నమెంట్ ఆసాంతం మంచి ప్రతిభ కనబరిచి,న్యూజిలాండ్ ను ఫైనల్ కు చేర్చిన ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ప్రకటించారు. ఇక నాలుగు సంవత్సరాల తర్వాత 2023 లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ కు భారతదేశం ఆతిధ్యం వహించనుంది.

 

[subscribe]
[youtube_video videoid=6gZfsqFE13k]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − sixteen =