విరాట్‌ కోహ్లీకి చిన్నారి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

Virat Kohli Receives A Bracelet Gifted by Young Fan at Barbados West Indies,Virat Kohli Receives A Bracelet,Bracelet Gifted by Young Fan,Virat Kohli Young Fan at Barbados,Kohli Fan at Barbados West Indies,Kohli Bracelet Gifted at Barbados West Indies,Mango News,Mango News Telugu,Virat Kohli,surprise gift for Virat Kohli,Rohit Sharma,Surya Kumar Yadav, Bracelet gift,West Indies vs India,Virat Kohli gets gifted hand made bracelet,Kohlis blockbuster reaction,Virat Kohli receives a special gift,Virat Kohli Wins Hearts,Virat Kohli Latest News,Virat Kohli Latest Updates,Virat Kohli Live News

కోహ్లీ ఈ పేరు వింటేనే చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకూ వైబ్రేషన్స్ స్టార్టవుతాయి. ఎన్ని రన్స్ కొట్టాడనేది మ్యాటరే కాదు.. గేమ్‌లో కోహ్లీ ఉన్నాడా లేదా అన్నదే చూస్తారు. విరాట్ బ్యాటు పట్టుకుంటే.. తామే బ్యాటింగ్ చేస్తున్నామా అన్నట్లు ఫీలయిపోతారు. గుండెల నిండా దాగి ఉన్న అభిమానాన్ని కోహ్లీ.. కోహ్లీ అని అరుస్తూ ఎలుగెత్తి చాటుకుంటారు. సందర్భం వస్తే చాలు తాము కోహ్లీని ఎంతగా ఇష్టపడుతున్నామో చెప్పడానికి రెడీ అవుతారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఈ మధ్య జరిగింది. దీనిని సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. తొలి వన్డేలో నెగ్గి 1-0తో ముందంజలో ఉన్న టీమ్‌ఇండియా.. శనివారం రోజు జ‌రిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఓట‌మి పాల‌యింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాట‌ర్లు అభిమానులను అలరించకపోయినా.. మ్యాచ్ అనంత‌రం టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ చేసిన ప‌ని అంద‌రినీ ఆక‌ట్టుకుంది. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఒక చిన్నారి స్టేడియంలో నిలబడి కోహ్లీ.. కోహ్లీ.. అంటూ పిల‌వ‌గా.. కోహ్లీ ఆ చిన్నారి ద‌గ్గర‌కు వెళ్లి చిన్నారిని, ఆమె కుటుంబాన్ని కలిశాడు. ఈ క్రమంలో ఆ చిన్నారి కోహ్లీకి బ్రేస్‌లెట్ గిప్ట్‌గా ఇచ్చింది. ఆ బ్రేస్‌లెట్ ధ‌రించిన కోహ్లీ చిన్నారికి థాంక్యూ చెప్పాడు. అనంతరం ఆ ఫ్యామిలీకి ఆటోగ్రాఫ్ ఇచ్చి వాళ్లతో సెల్ఫీ దిగాడు.

కోహ్లీ త‌ర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ కుటుంబాన్ని క‌లిసి ఫోటోలు దిగారు. ఈ ఘ‌ట‌న‌పై చిన్నారి స్పందిస్తూ.. ‘నేను కోహ్లీ కోహ్లీ.. అంటూ అరుస్తుంటే కోహ్లీ విని నా దగ్గరకు వచ్చాడు. అప్పుడే నేను స్వయంగా చేసిన బ్రేస్‌లెట్‌ను తనకు ఇచ్చానని’ చిన్నారి చెప్పింది. దీనిపై తండ్రి మాట్లాడుతూ.. ‘నా కూతురు పిలువ‌గానే కోహ్లీ ఇక్కడ‌కు వచ్చాడు. పాప ఇచ్చిన‌ బ్రేస్‌లెట్ తీసుకుని నేను వేసుకోవచ్చా అని అడిగాడు. అప్పుడు సంతోషంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కోహ్లీ డౌన్ టు ఎర్త్ మనస్తత్వంతో ఉన్నాడని’ తెలిపాడు. బీసీసీఐ అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 4 =